Friday, 6 November 2026

భక్తులతో పోటెత్తిన క్షీరారామం

ఏలూరు,ఫిబ్రవరి17(జ‌నంసాక్షి): మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పంచారామ క్షేత్రాల్లో ఒకటైన పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయం భక్తులతో పోటెత్తింది. వేకువజామున 2 గంటలకు స్వామి వారికి అభిషేకం చేసిన అనంతరం దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. స్వచ్ఛంద సంస్థలు, దేవాలయం ఆధ్వర్యంలో భక్తులకు ప్రసాద వితరణ, మంచినీళ్ల ప్యాకెట్లు అందజేశారు. పట్టణ సీఐ రజనీ కుమార్‌ పర్యవేక్షణలో పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తున్నారు. ప్రసిద్ధ ఆచంటేశ్వర క్షేత్రం భక్తులతో పోటెత్తింది. వేకువజామున 3 గంటలనుంచే భక్తులు స్వయంభువుగా వెలిసిన రామేశ్వరుడిని దర్శించుకునేందుకు బారులు తీరారు. ఆలయం శివనామ స్మరణలతో మారుమ్రోగింది. ప్రత్యేక అభిషేకాలు, పూజలతో ఆలయం కిక్కిరిసింది. స్వామివారిని స్థానిక ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ దంపతులు, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఎస్వీ సోమయాజులు తదితరులు దర్శించుకున్నారు. రామేశ్వరస్వామి సత్రంలో భక్తులకు అన్నదాన సమాజ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు.మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా దెందులూరు మండలంలోని శివాలయాలు మంగళవారం భక్తులతో పోటెత్తాయి. దోసపాడులోని కామద కాశీ విశ్వేశ్వరాలయం, సల్లచింతలపూడిలోని శ్రీమేధాదక్షిణమూర్తి ఆలయం, జోగన్నపాలెంలోని యోగలింగేశ్వరస్వామి ఆలయం, పోతులూరి, కవ్వలి, శ్రీరామవనం, గంగన గూడెం, దెందులూరి గ్రామాల్లోని శివాలయాల్లో తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పసిద్ధ ఆచంటేశ్వర క్షేత్రం భక్తులతో పోటెత్తింది. వేకువజామున 3 గంటలనుంచే భక్తులు స్వయంభువుగా వెలిసిన రామేశ్వరుడిని దర్శించుకునేందుకు బారులు తీరారు. ఆలయం శివనామ స్మరణలతో మారుమ్రోగింది. ప్రత్యేక అభిషేకాలు, పూజలతో ఆలయం కిక్కిరిసింది. స్వామివారిని స్థానిక ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ దంపతులు, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఎస్వీ సోమయాజులు తదితరులు దర్శించుకున్నారు. రామేశ్వరస్వామి సత్రంలో భక్తులకు అన్నదాన సమాజ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు.

ద్వారక తిరుమలకు పాదయాత్ర

ఏలూరు తూర్పువీధికి చెందిన సాయిబాబా ఆలయ భక్తులు సుమారు 3 వేల మంది మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ద్వారక తిరుమలకు పాదయాత్ర చేపట్టారు. షిరిడీ సాయిబాబా ఆలయ రథంతో బయలు దేరిన ఈ బృందానికి దెందులూరు మండలం సోమర్పాడు, వాపన్నపాలెం,

జోగన్నపాలెం గ్రామాల పరిధిలో ఆయా గ్రామాలకు చెందిన వారు మంగళవారం అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు. భక్తులు సాయినామ స్మరణతో పాదయాత్ర చేస్తూ బయలు దేరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *