Tuesday, 3 November 2026

భద్రతపై నౌకదళాల పాత్ర అసమానమైనది

C
– ప్రధాని మోదీ

– సాగరతీరాన ఆకట్టుకున్న విన్యాసాలు

విశాఖపట్నం,ఫిబ్రవరి 7(జనంసాక్షి): దేశ భద్రతలో నౌకదళాల పాత్ర అసమానమైదనదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. నగరంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ నౌకదళ ప్రదర్శనను వీక్షించేందుకు వచ్చిన ఆయన మాట్లాడుతూ..  విశాఖ ప్రజల స్ఫూర్తి అభినందనీయమని ప్రధాని అన్నారు. అందమైన విశాఖ నగరమంటే తనకు ఎంతో ఇష్టమని వ్యాఖ్యానించారు. హుద్‌హుద్‌ విలయం సంభవించినప్పుడు తాను విశాఖ పర్యటనకు వచ్చానని అన్నారు. విశాఖ ప్రజలు 14నెలల్లోనే ధైర్యంగా తేరుకున్నారని ప్రశంసించారు. ఫ్లీట్‌ రివ్యూను అద్భుతంగా నిర్వహించిన నౌకాదళానికి ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు.

సీఎం చంద్రబాబుకు ప్రత్యేక అభినందనలు

అంతర్జాతీయ స్థాయి కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిన ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. తూర్పుతీరంలో ఇలాంటి అద్భుత కార్యక్రమానికి ప్రపంచ నలుమూలల నుంచి తరలివచ్చారని పేర్కొన్నారు. తీరప్రాంత దేశాలతో ఆర్థిక, వాణిజ్య సంబంధాల బలోపేతానికి మారిటైమ్‌ ఉపయోగపడుతుందని, సముద్రాల ద్వారా 20 ట్రిలియన్ల విలువైన వాణిజ్యం జరుగుతోందని ప్రధాని తెలిపారు. భారత్‌కు 7,500 చదరపు కిలోవిూటర్ల తీర ప్రాంతం ఉందని, సునావిూ, తుపాను వంటి ప్రకృతి వైపరీత్యాలు సవాళ్లు విసురుతున్నాయన్నారు. అన్ని దేశాల నౌకాదళాలు సమష్టిగా భద్రతపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు.

విశాఖ ప్రజల స్ఫూర్తి అభినందనీయం: ప్రధాని మోదీ

విశాఖపట్నం: విశాఖ ప్రజల స్ఫూర్తి అభినందనీయమని ప్రధాని నరేంద్రమోదీ కొనియాడారు. నగరంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ నౌకదళ ప్రదర్శనను వీక్షించేందుకు వచ్చిన ఆయన మాట్లాడుతూ.. అందమైన విశాఖ నగరమంటే తనకు ఎంతో ఇష్టమని వ్యాఖ్యానించారు. హుద్‌హుద్‌ విలయం సంభవించినప్పుడు తాను విశాఖ పర్యటనకు వచ్చానని అన్నారు. విశాఖ ప్రజలు 14నెలల్లోనే ధైర్యంగా తేరుకున్నారని ప్రశంసించారు. ఫ్లీట్‌ రివ్యూను అద్భుతంగా నిర్వహించిన నౌకాదళానికి ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు.

సీఎం చంద్రబాబుకు ప్రత్యేక అభినందనలు

అంతర్జాతీయ స్థాయి కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిన ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. తూర్పుతీరంలో ఇలాంటి అద్భుత కార్యక్రమానికి ప్రపంచ నలుమూలల నుంచి తరలివచ్చారని పేర్కొన్నారు. తీరప్రాంత దేశాలతో ఆర్థిక, వాణిజ్య సంబంధాల బలోపేతానికి మారిటైమ్‌ ఉపయోగపడుతుందని, సముద్రాల ద్వారా 20 ట్రిలియన్ల విలువైన వాణిజ్యం జరుగుతోందని ప్రధాని తెలిపారు. భారత్‌కు 7,500 చదరపు కిలోవిూటర్ల తీర ప్రాంతం ఉందని, సునావిూ, తుపాను వంటి ప్రకృతి వైపరీత్యాలు సవాళ్లు విసురుతున్నాయన్నారు. అన్ని దేశాల నౌకాదళాలు సమష్టిగా భద్రతపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు.

భద్రతపై నౌకాదళాలు దృష్టి సారించాలి

భద్రతపై అన్ని దేశాల నౌకాదళాలు దృష్టి సారించాలని ప్రధాని మోడీ సూచించారు. విశాఖలో జరిగిన ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌ రివ్యూ వేడుకలకు ఆయన హాజరై, ప్రసంగించారు. 90 శాతం వాణిజ్యం సముద్రాల ద్వారానే జరుగుతుందని చెప్పారు. సునావిూ, తుపాను వంటి ప్రకృతి వైపరీత్యాలు సవాళ్లను విసురుతున్నాయన్నారు. ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌ రివ్యూను అద్భుతంగా నిర్వహించిన నౌకాదళానికి అభినందనలు తెలిపారు. అంతర్జాతీయ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు.

సాగరతీరం.. అద్భుత విన్యాసాల హారం

విశాఖపట్నం: విశాఖలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ నౌకా దళ ప్రదర్శన వీక్షకులకు కనువిందు చేసింది. ఆదివారం, సెలవుదినం కావటంతో నౌకాదళ విన్యాసాలను వీక్షించేందుకు సందర్శకులు పెద్ద ఎత్తున సముద్రతీరానికి తరలివచ్చారు. నౌకా విన్యాసాల్లో జాతీయ, అంతర్జాతీయ యుద్ధ నౌకలను ప్రదర్శించారు. మిగ్‌-29 విమాన విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ విన్యాసాలను తిలకించేందుకు ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర రక్షణశాఖ మంత్రి మనోహర్‌ పారికర్‌, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు, తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సహా అతిరథ మహారథులు తరలి వచ్చారు. ప్రత్యేక గ్యాలరీలో ఆశీనులైన ప్రధాని మోదీకి విన్యాసాల గురించి నౌకదళ అధికారులు వివరించారు. నౌకా విన్యాసాలను వీక్షించేందుకు విూ-సేవా కేంద్రాల ద్వారా 1.40లక్షల మంది పాస్‌లను పొందారు. వీరేకాకుండా మరో 17వేల మందికిపైగా వీఐపీ పాస్‌లు దక్కించుకున్నారు. సందర్శకుల కోసం విశాఖ ఆర్కే బీచ్‌లో ఏర్పాటు చేసిన అన్ని గ్యాలరీలు జనసంద్రంగా మారాయి. విన్యాసాలను నేరుగా చూడలేని వారికి నగరంలోని 50 థియేటర్లలో ప్రత్యేకంగా ప్రదర్శన ఏర్పాటు చేశారు.

అబ్బురపరిచిన నౌకాదళాల విన్యాసాలు

నావికా దళాల విన్యాసాలతో ఏపీలోని విశాఖలో సాగర తీరం సందడిగా మారింది. నాలుగు రోజులుగా కొనసాగుతున్న ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌ రివ్యూలో భాగంగా పలు దేశాలకు చెందిన నావికా దళాలు అబ్బురపరిచే విన్యాసాలు చేస్తున్నాయి. యుద్ద నౌకలు, నేవీ సిబ్బంది సాహసోపేతమైన విన్యాసాలను చూసేందుకు వేలాది మంది ప్రజలు సాగరతీరానికి పోటెత్తారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు మనోహర్‌ పారికర్‌, వెంకయ్య నాయుడు, గవర్నర్‌ నరసింహన్‌, ఏపీ సీఎం చంద్రబాబు సహా పలువురు ప్రముఖులు ఫ్లీట్‌ రివ్యూను ఆసక్తిగా వీక్షించారు. తీర ప్రాంత భద్రత ఆర్ధికాభివృద్ధికి ఎంతో కీలకమన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. తీర ప్రాంత దేశాలతో ఆర్ధిక, వాణిజ్య సంబంధాలు మరింత బలోపేతం చేసుకునేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఏప్రిల్‌ లో జరిగే మారిటైమ్‌ సదస్సుకు భారత్‌ ఆతిధ్యం ఇస్తున్నట్లు తెలిపారు. ఈ సదస్సుతో తీర ప్రాంత దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సముద్ర మార్గాల ద్వారానే ప్రపంచంలో 90శాతం వాణిజ్యం జరుగుతోందన్నారు ప్రధాని. భారత నావికా దళంతో పాటు అమెరికా, చైనా, రష్యా, మలేషియా, ఇండోనేషియా వంటి 50 దేశాలు ఫ్లీట్‌ రివ్యూలో పాల్గొంటున్నాయి. ఆయా దేశాలకు చెందిన యుద్ధ నౌకలు, నావికా, వైమానిక దళాలు చేస్తున్న విన్యాసాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. యుద్ధ విమానాల నుంచి పారాచూట్లతో భద్రతా సిబ్బంది కిందకి దిగుతూ?చేసిన విన్యాసాలకు సందర్శకుల నుంచి భారీ రెస్పాన్స్‌ వచ్చింది. అన్ని దేశాల సిబ్బంది తమ సామర్ధ్యాన్ని చాటేందుకు భారీ విన్యాసాలు చేశారు. యుద్ధ ట్యాంకులతో పాటూ మిగ్‌-29 విమానాలు, పలు దేశాలకు చెందిన యుద్ధ నౌకలు ఫ్లీట్‌ రివ్యూలో ప్రత్యేకాకర్షణగా నిలిచాయి. సముద్రం లో నౌకలు భారీ విన్యాసాలు చేశాయి. శత్రు దేశాల నుంచి రక్షణ కోసం తాము సిద్ధంగా ఉన్నామని తెలిపేలా చేసిన మాక్‌ డ్రిల్‌ సందర్శకులను ఆకట్టుకుంది. ప్రదర్శనలో భాగంగా కొన్ని టార్గెట్‌ లను కూడా చేధించి చూపించారు. నేవీ విన్యాసాల అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మేకిన్‌ ఇండియా, ఇస్రోతో పాటూ పలు శకటాలను ప్రదర్శించారు. మేకిన్‌ ఇండియా థీమ్‌ తో ఏర్పాటు చేసిన శకటం ప్రత్యేకాకర్షణగా నిలిచింది. శకటాల ప్రదర్శనను ప్రధాని మోడీ ఆసక్తిగా తిలకించారు. అనంతరం ఇంటర్నేషనల్‌ సిటీ పరేడ్‌ లో అన్ని దేశాలకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు. అమెరికా, చైనా, రష్యా, మలేషియా, బ్రిటన్‌, ఆస్ట్రేలియాలకు చెందిన నేవీ సిబ్బంది ఇంటర్నేషనల్‌ సిటీ పరేడ్‌ లో పాల్గొన్నారు. ప్రధాని మోడీ నేవీ గౌరవ వందనం స్వీకరించారు. సాయం సంధ్యవేళ?నేవీ విన్యాసాలకు తోడు వాటికి లేజర్‌ ఎఫెక్ట్‌ కూడా జోడించారు. లేజర్‌ కిరణాలతో ఏర్పాటు చేసిన షోతో పాటూ యుద్ధ నౌకలను రంగు రంగుల లైట్లతో అలకంరణ చేశారు. దాంతో సాగర తీరం ఇంద్ర ధనస్సును తలపించింది. ఆదివారం సెలవు దినం కావటంతో నౌకాదళ విన్యాసాలను వీక్షించేందుకు సందర్శకులు పెద్ద ఎత్తున సముద్రతీరానికి తరలివచ్చారు. దాదాపు లక్షన్నర మందికి ఫ్లీట్‌ రివ్యూను ప్రత్యక్షంగా చూసేందుకు పాసులు ఇచ్చారు. అంతేకాదు విశాఖలోని 50కి పైగా సినిమా థియేటర్లలో ఫ్లీట్‌ రివ్యూను లైవ్‌ ఇచ్చారు. ఇంటర్నేషనల్‌ ఫ్టీట్‌ రివ్యూకు విశాఖ ఆతిధ్యం ఇవ్వడంపై నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరు కావడంతో భారీ భద్రత ఏర్పాటు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *