– ఏసియన్ వాణిజ్య దేశాల సదస్సులో ప్రధాని మోదీ
కౌలాలంపూర్,నవంబర్21(జనంసాక్షి): భవిష్యత్తులో ఆసియా దేశాలు బలమైన శక్తులుగా ఎదుగుతాయని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శనివారం ఏసీయన్ దేశాల వాణిజ్య సదస్సులో పాల్గొన్న మోదీ ప్రసంగిస్తూ 21వ శతాబ్దం ఆసియాదే అని ధీమా వ్యక్తం చేశారు. ఆసియా దేశాలు బలమైన ఆర్థిక శక్తిగా ఎదగాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సంస్కరణలవైపు ప్రతి ఒక్కరూ అడుగు వేయాల్సిందేని అని పిలుపునిచ్చారు. భారత్, తూర్పు ఆసియా దేశాలు సహజ భాగస్వాములన్నారు. వ్యాపారవేత్తలు భారత్‌కు రండి.. మారిన భారత్‌ను చూడాలపి ప్రధాని పిలుపునిచ్చారు. పెట్టుబడులకు భారత్ గమ్యస్థానంగా మారిందని చెప్పారు. భారత్‌లో 50 నగరాల్లో మెట్రో సర్వీసులు కల్పించినట్లు మోదీ వెల్లడించారు. 21వ శతాబ్దం ఆసియాదేనని అంటూ ఆసియా ఖండంలో చిన్న, పెద్ద దేశాలు ఆర్థికంగా వృద్ధి సాధిస్తున్నాయని వెల్లడించారు. భారత్, తూర్పు ఆసియా దేశాలు సహజ భాగస్వాములని పేర్కొన్నారు. ఆసియా దేశాలు బలమైన ఆర్థిక శక్తిగా ఎదగాలని ఆకాంక్షించారు. ఆర్థికాభివృద్ధిలో భారత్ పురోగతి సాధించి,. జీడీపీ వృద్ధి పెరిగిందన్నారు. ద్రవ్యోల్భణం తగ్గింది. భారత్‌ను గ్లోబల్ మ్యానుఫ్యాక్టరింగ్ హబ్‌గా మార్చేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. భారత్‌లోని 50 నగరాల్లో మెట్రో సర్వీసులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఉగ్రవాదం, మానవ అక్రమరవాణ, తీర ప్రాంతాల భద్రత, దక్షిణ ప్రాంత వివాదం, వాణిజ్యం తదితర ప్రాంతాలపై ప్రధాని మాట్లాడారు. సంస్కరణలవైపు ప్రతి ఒక్కరూ అడుగు వేయాల్సిందేనని ప్రధానమంత్రి అన్నారు.సంస్కరణలకు అంతమంటూ ఉండదు, కొనసాగాల్సిందేనన్నారు.మలేసియా పర్యటనలో భాగంగా కౌలాలంపూర్ చేరుకున్న ప్రధాని మోదీకి ఘనస్వాగతం లభించింది. అనంతరం మోదీ చైనా ప్రధాని కీక్వాంగ్‌తో సమావేశమయ్యారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించినట్లు సమాచారం.





