Tuesday, 3 November 2026

భానుడి భగ భగ..

00kqyhi6హైదరాబాద్ : ప్రజలపై సూర్యుడు నిప్పులు చిమ్ముతున్నాడు. రాష్ట్రంలో ఎండ వేడిమికి ప్రజలు విలవిల్లాడుతున్నారు. నాలుగు రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో ఎండలు ఉధృతరూపం దాల్చాయి. రాష్ట్రంలో సరాసరి ఉష్ణోగ్రత మూడు డిగ్రీలు పెరిగింది. పగటి వేళ ఉష్ణోగ్రత గరిష్ఠంగా నమోదవుతోంది. అన్ని ప్రాంతాల్లో సరాసరి ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు చేరుకుంది. ఒకవైపు ఎండలు, మరోవైపు వడ దెబ్బలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. వృద్ధులు, పిల్లల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వడదెబ్బకు తట్టుకోలేక వృద్ధులు కన్నుమూస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎండలు భాగా ఎక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఎండలు తాళలేక ప్రజలు శీతలపానీయాలను సేవిస్తున్నారు. ఇదే అదునుగా భావించిన అమ్మకం దార్లు వాటి రేట్లు కూడా పెంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో వేసవికాలంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *