Wednesday, 4 November 2026

భారత్‌తో మాకు సత్సంబంధాలే

ఒబామా పర్యటన చిరస్మరణీయం

వాషింగ్టన్‌ వెల్లడి

న్యూఢిల్లీ,జనవరి22(జనంసాక్షి): గణతంత్ర దినోత్సవం లాంటి కార్యక్రమాలలో అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా మునుపెన్నడూ పాల్గొనలేదని వాషింగ్టన్‌లోని ఉన్నతాధికారులు తెలిపారు. బరాక్‌ ఒబామా భారత పర్యటనలో భాగంగా గణతంత్ర దినోత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొననున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడి అధికారులు మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాల్లో ఒబామా పాల్గొనలేదన్నారు. భారత్‌లో ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం అమెరికా, భారత్‌ రెండు దేశాల చరిత్రలోనూ చిరస్మరణీయంగా మిగిలిపోతుందన్నారు. ఇక ఒబామా పర్యటన దగ్గరపడడంతో పాటు, గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని భద్రతా చర్యలను ముమ్మరం చేశారు. ఒబామా పర్యటించే ప్రాంతాల్లో గస్తీ ముమ్మరం చేశారు. దీనికితోడు అమెరికా భద్రతాధికారులు కూడా ఆయా ప్రాంతాలపై డేగకన్ను వేశారు. ఒబామా మూడురోజుల పర్యటన కోసం భద్రతా ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని కేంద్ర ¬ంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ తెలిపారు. ఎక్కడా ఎలాంటి సమస్య తలెత్తబోదని ఆయన చెప్పారు. అటు అంతర్జాతీయ సరిహద్దులో అదనంగా 1200 మంది సిబ్బందిని మోహరించారు. భద్రతా కారణాలతోపాటు దృష్టి మరల్చ5డానికి జరిగే దాడులను నివారించడానికి ముందు జాగ్రత్తచర్యగా సరిహద్దుల్లో భద్రతను పెంచామని రక్షణమంత్రి మనోహర్‌ పారికర్‌ తెలిపారు. తాజ్‌మహల్‌ సందర్శనకు ఈ నెల 27న వస్తున్న అమెరికా అధ్యక్షుడు ఒబామా కోసం ఆగ్రాలో భారీ భద్రత ఏర్పాటుచేశారు. వంద మంది అమెరికా భద్రతాధికారులతోపాటు నాలుగు వేల మంది భారత బలగాలు ఒబామాకు రక్షణగా నిలువనున్నాయి. భద్రతా ఏర్పాట్లకు తుదిరూపు ఇచ్చేందుకు నాలుగువేల మంది స్థానిక పోలీసులు, పారామిలిటరీ బలగాలు, వందమంది అమెరికా భద్రతాధికారులతో పటిష్ఠమైన భద్రత ఏర్పాటుచేస్తున్నారు.   గగనతలంలో నిఘా కోసం యూపీ ప్రభుత్వం ప్రత్యేకంగా హెలికాప్టర్‌ను అద్దెకు తీసుకోనున్నది. ఖేరియా విమానాశ్రయం నుంచి తాజ్‌మహల్‌ వరకు 11 కిలోవిూటర్ల మేర సీసీ కెమెరాలు ఏర్పాటుచేశారు. నగరంలోని అమర్‌విలాస్‌ ¬టల్లో ఒబామా కాసేపు విశ్రాంతి తీసుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ¬టల్లో ఇప్పటికే వీవీఐపీ సూట్‌ బుక్‌ చేసి ఉంచారు. అటు గణతంత్ర వేడుకల కోసం తొలిసారి ఎయిర్‌బోర్న్‌ వార్నింగ్‌ అండ్‌ కంట్రోల్‌ సిస్టమ్‌ ను వినియోగించనున్నారు. ఇదిలావుంటే అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా భారత్‌ పర్యటన దగ్గర పడుతుండడంతో రెండు దేశాల అధికారులు ఏర్పట్లలో పోటా పోటీగా నిమగ్నమయ్యారు. భారత దేశం భద్రతను ఎప్పుడూ లేనంతగా కట్టుదిట్టం చేసింది. అయినా సెక్యూరిటీ ఏర్పట్లపై అమెరికా అధికారుల్లో అసంతృప్తి నెలకొంది. రాజ్‌పథ్‌ దగ్గరలోని 71 ఆకాశ హర్మ్యాలను పూర్తిగా కానీ, పాక్షికంగాకానీ మూసివేస్తున్నారు. జనవరి 26 ఉదయం నుంచి అన్ని మెట్రో స్టేషన్లను మూసివేయనున్నారు. పరేడ్‌ రోజున 40 వేల మంది భద్రతా బలగాలు విధుల్లో ఉంటాయి. రాజ్‌పథ్‌లోని పరేడ్‌ జరిగే మూడు కిలోవిూటర్ల ప్రాంతంలో 160 సీసీ కెమెరాలను… ముఖాలను గుర్తించగల మరో 80 కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. పరేడ్‌ జరిగే సమయంలో ఢిల్లీపై 35వేల అడుగుల ఎత్తువరకు నో ఫ్లై జోన్‌గా ప్రకటించారు. 400 కిలోవిూటర్ల పరిధిలో విమానాల ప్రయాణాలను ప్రభుత్వం నిషేధించింది. జనవరి 27న ఒబామా తాజ్‌మహల్‌ను సందర్శిస్తున్న సమయంలో ఆయనకు రక్షణగా వంద మంది అమెరికా సిబ్బందికి తోడు వేలమంది భారతీయ భద్రతా సిబ్బంది విధుల్లో ఉంటుంది. అయితే ఇన్ని భద్రతా ఏర్పాట్లు చేసినా అమెరికా అధికార్లులో ఇంకా అసంతృప్తి నెలకొంది. దీనికి ప్రధాన కారణం భద్రతా చర్యలకు సంబంధించి ఆ దేశ సీక్రెట్‌ ఎజెన్సీ చేసిన అనేక సూచనలను భారత్‌ ఏజెన్సీలు పక్కనపెట్టాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *