Wednesday, 4 November 2026

భోపాల్‌ విషవాయువును ఒబామా దృష్టికి తీసుకెళ్లండి

4
భారత్‌ను కోరిన అమ్నెస్టీ

దావోస్‌, జనవరి22(జనంసాక్షి): భారత్‌లో అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా పర్యటనలో ౖభోపాల్‌’ విషవాయువు ఉదంతాన్ని ప్రస్తావించాలని అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ ౖఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌’ భారత్‌ను కోరింది. దశాబ్దాలుగా న్యాయం కోసం బాధితులు నిరీక్షిస్తున్నారని పేర్కొంది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ సెక్రటరీ జనరల్‌ సలీల్‌ షెట్టీ దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సు సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. ఒబామా పర్యటనలో చర్చల సందర్భంగా ౖభోపాల్‌’ విషవాయువు దుర్ఘటన అంశాన్ని ఆయన దృష్టికి ప్రధాని నరేంద్ర మోదీ తీసుకురావాలని కోరారు. ఆ దుర్ఘటన దుష్ప్రభావాలు ఇప్పటికీ ఒకతరం నుంచి మరో తరానికి పాకుతున్నాయని చెప్పారు. దశాబ్దాలుగా ప్రజలు న్యాయం కోసం నిరీక్షిస్తున్నారని అన్నారు. మానవ ఆరోగ్యంపై అత్యంత ప్రభావం చూపిన పారిశ్రామిక దుర్ఘటనల్లో అది ఒకటని పేర్కొన్నారు. బాధితులకు న్యాయం చేసేందుకు రాజకీయ చిత్తశుద్ధి అవసరమని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *