నల్లధనం లేని, అవినీతి రహిత దేశంగా భారత్‌ను మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణంగా మద్దతిస్తుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. పెద్ద నోట్ల రద్దుతోనే ఆగిపోవద్దని, వివిధ రూపాల్లో విస్తరించిన నల్లధనానికి సమూలంగా అడ్డుకట్ట వేయాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. ‘‘నోట్ల రద్దు చర్యను గుడ్డిగా వ్యతిరేకించాల్సిన పనిలేదు. మద్దతివ్వాల్సిన పని లేదు. ఇదో పెద్ద సంస్కరణగా గుర్తించాలి. నగదు రహిత లావాదేవీలతో
భవిష్యత్తులో ప్రజలకు మేలు జరుగుతుంది. ఈ వ్యూహాన్ని అర్థం చేసుకునేందుకు సమయం పడుతుంది’’ అని పేర్కొన్నారు. ఆస్తులు, అంతస్తులు, భూములు, వజ్రాలు, బంగారం, వెండి, షేర్ మార్కెట్, హవాలా, విదేశీ మారకద్రవ్యం, విదేశాల్లో హవాలా సొమ్ము.. రూపంలో ఉన్న నల్లధనాన్ని అరికట్టేందుకు చర్యలు చేపడితే తమ ప్రభుత్వం తరఫున కేంద్రానికి సంపూర్ణ మద్దతుంటుందని వెల్లడించారు. ‘‘ఎవరు ఎవరినీ లంచం అడగొద్దు.. ఎవరు ఎవరికి లంచం ఇవ్వొద్దు.. అలాంటి రోజులు రావాలి అని అన్నారు.
భారత్‌ను మార్చేందుకు మద్దతు




