
బలపడ్డ సంబంధం.. రష్యా అధ్యక్షుడు పుతిన్
కాల పరీక్షకు రెండు దేశాలు నిలబడ్డాయి – ప్రధాని మోదీ
న్యూఢిల్లీ,డిసెంబర్11(జనంసాక్షి): భారత్ రష్యా మధ్య అణు ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ మాట్లాడుతూ.. రెండు దేశాల సంబంధాలు బలపడ్డాయన్నారు. భారత్, రష్యాలు సహజ మిత్రులుగా కొనసాగుతున్నాయన్న ఆయన ప్రస్తుతం చేసుకున్న ద్వైపాక్షిక ఒప్పందాలు భారత్‌ను ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామిగా చేశాయన్నారు. రక్షణ, ఇంధన, ఆర్థిక రంగాల్లో ఇరుదేశాల మధ్య సన్నిహిత సంబంధాలు ఏర్పాటవుతున్నాయన్నారు. భారత్‌లో పెట్టుబడులకు తమ దేశ కంపెనీలను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. కుదంకుళం మొదట యూనిట్‌ను విజయవంతంగా ప్రారంభించామని, మిగిలిన 3 యూనిట్లను కూడా అదే స్ఫూర్తితో పూర్తిచేస్తామన్నారు. రష్యాకు చెందిన అతిపెద్ద చమురు సరఫరా సంస్థ గ్యాస్‌ప్రోమ్ భారత్‌కు అవసరమైన సరఫరా చేస్తుందని పుతిన్ హావిూ ఇచ్చారు. భారత్, రష్యా రక్షణ ఉత్పత్తుల తయారీకి బ్ర¬్మస్ ఒక నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
భారత్, రష్యా సంబంధాలు కాలపరీక్షకు నిలబడ్డాయని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. భారత్- రష్యా దేశాలు పలు కీలక ఒప్పందాలపై సంతకాలు చేసిన అనంతరం మోదీ మాట్లాడుతూ ఏటా వ్యూహబంధ సమావేశాలు నిర్వహించాలనేది వాజ్‌పేయీ సమయంలో జరిగిన నిర్ణయమన్నారు. భారత రక్షణ రంగంలో రష్యాది మరవలేని పాత్ర అని, భారత్‌కు అత్యంత ప్రధానమైన రక్షణ భాగస్వామి రష్యా అని మోదీ పేర్కొన్నారు. భారత్‌లో రక్షణ పరికరాల తయారుచేయాలన్న నిర్ణయానికి రష్యా సహకరిస్తోందన్నారు. అత్యంత ఆధునిక హెలిక్టాపర్లను భారత్‌లో తయారుచేసేందుకు రష్యా ముందుకొచ్చిందని ప్రధాని తెలిపారు. కుదంకుళం అణు విద్యుత్ కర్మాగారం భారత్, రష్యా సంబంధాలకు ప్రతీక అని పేర్కొన్న ఆయన కుడంకుళంలో ఏర్పాటు చేయాల్సిన మరో 3 యూనిట్లు సజావుగా సాగుతాయన్నారు. చమురు, సహజవాయువు రంగాల్లో ఇవాళ జరిగిన ఒప్పందాలు భవిష్యత్ స్నేహానికి సూచిక అన్నారు. భారత్‌తో నిరంతర సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నందుకు పుతిన్‌కు ప్రధాని ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
భారత్ – రష్యా ల మధ్య కీలక ఒప్పందాలు
భారత్, రష్యా దేశాల మధ్య గురువారం కీలక ఒప్పందాలు చోటుచేసుకున్నాయి. రక్షణ, అణుఇంధన, వాణిజ్య, చమురు, సహజవాయువులు తదితర రంగాలకు సంబంధించి ఇరు దేశాల మధ్య ఈ ఒప్పందాలు జరిగాయి. భారత పర్యటనలో ఉన్న రష్యా అధ్యక్షడు పుతిన్‌తో భారత ప్రధాని మోదీ కీలక చర్చలు జరిపారు. అనంతరం ఇరు దేశాలూ ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఐడీఎఫ్సీ, రష్యా ప్రత్యక్ష పెట్టుబడుల సంస్థ మధ్య పెట్టుబడుల ఒప్పందం, భారత్, రష్యా శాస్త్ర సాంకేతిక పరిశోధన సంస్థల మధ్య ఒప్పందం, ఎస్ఆర్ ఆయిల్, రాస్నెట్ మధ్య చమురు సరఫరా ఒప్పందం తదితరాలపై ఇరుదేశాలూ సంతకాలు చేశాయి.




