Tuesday, 3 November 2026

భారత్ చేరుకున్న ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండ్

soyvbes0ఫ్రాన్స్ అధ్యక్షుడు హొలాండే భారత్ చేరుకున్నారు. చండీగఢ్ విమానాశ్రయానికి చేరుకున్న హొలాండేకు హర్యానా గవర్నర్ సహా పలువురు అధికారులు ఘన స్వాగతం పలికారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో హొలాండే ముఖ్య అతిధిగా పాల్గొననున్నారు. భారత్ లో ఆయన మూడు రోజుల పాటూ పర్యటిస్తారు. ఆయన పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలను కుదుర్చుకునే అవకాశం ఉంది. ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కానున్న హొలాండే, ఆయనతో కలిసి బిజినెస్ సమ్మిట్ లో పాల్గొంటారు. అక్కడ పలు కంపెనీల సీఈవోలతో భేటీ అవుతారు. హొలాండే రాక నేపధ్యంలో చండీగఢ్ తో పాటూ ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *