Wednesday, 4 November 2026

భార్యకోసం తెచ్చిన సొమ్ము దొంగలపాలైంది

ఏలూరు నగరంలోని ఓ ఇంట్లో రూ. 2 లక్షల నగదు, 2 సవర్ల బంగారాన్ని ఆదివారం తెల్లవారుజామున గుర్తుతెలియని దొంగలు చొరబడి దొంగలించారు. నగరంలో వాచ్ మెకానిక్ షాపులో పనిచేస్తున్న అబ్దుల్ హజీజ్ హుసేన్ అనే వ్యక్తి తన భార్య గుండె శస్త్రచికిత్సకోసం అప్పుగా తెచ్చుకున్న డబ్బును గుర్తుతెలియని వ్యక్తులు దొంగలించడంతో ఏలూరు టూటౌన్ సీఐ బంగారురాజుకు ఫిర్యాదు చేయగా ఆయన సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. భార్య ఆరోగ్యం బాగు కోసం తెచ్చుకున్న డబ్బు పోవడంతో అబ్దుల్ హజీజ్ హుసేన్ కంటతడి పెట్టుకొని తన సొమ్ము ఇప్పించాలని వేడుకుంటున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *