హైదరాబాద్ లో ఓ కానిస్టేబుల్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ రామకృష్ణ తన భార్యను అత్యంత కిరాతకంగా చంపాడు. తన భార్య సుప్రియ కనిపిండం లేదని.. గత నెల 6వ తారీఖు నారాయణగూడ పీఎస్ ఫిర్యాదు చేశాడు. అయితే రామకృష్ణ వ్యవహార శైలిపై అనుమానం వచ్చిన పోలీసులు.. రామకృష్ణను అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో అసలు నిజం బయటపడింది. తన స్నేహితుడితో కలిసి సుప్రియను హత్య చేసినట్లు రామకృష్ణ ఒప్పుకున్నాడు. సుప్రియ శవాన్ని రంగారెడ్డి జిల్లా వికారాబాద్ అడవుల్లో కాల్చివేసినట్లు చెప్పాడు. రామకృష్ణ, సుప్రియలకు గతేడాది ఆగస్టు 20న వివాహం జరిగింది.
భార్యను చంపి పూడ్చిపెట్టిన ఎస్పీఎఫ్ కానిస్టేబుల్




