నెల్లూరు జనంసాక్షి : భార్యను హతమార్చిన భర్త ఉదంతం ఒకటి వెలుగులోకి వచ్చింది. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం ముత్తుకూరు గ్రామంలో ఓబులయ్య అనే వ్యక్తి తన భార్యను అనుమానంతో స్రూృడ్రైవరుతో పొడిచి హతమార్చాడు. వీరి పెళ్లి అయి 11 ఏళ్లు అయిందని, ఇద్దరు పిల్లలని పోలీసులు చెప్పారు. పోలీసులు కేసును విచారిస్తున్నారు.




