Wednesday, 4 November 2026

భార్యపై కిరోసిన్‌ పోసి నిప్పంటించిన భర్త

సంతమాగులూరు: ప్రకాశం జిల్లా సంతమాగులూరు ఎస్సీ కాలనీలో భార్యపై భర్త కిరోసిన్‌ పోసి నిప్పంటించిన ఘటన శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఎస్సై రాఘవరావు తెలిపిన వివరాల ప్రకారం… మేరమ్మ ఇంట్లో నిద్రిస్తుండగా ఆమె భర్త రమేష్‌ కిరోసిన్‌ పోసి నిప్పంటించాడు. దీంతో బాధితురాలు కేకలు వేస్తూ ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీసింది. స్థానికులు మంటలను ఆర్పివేసి చికిత్స నిమిత్తం మేరమ్మను నరసరావుపేటలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పక్షవాతంతో బాధపడుతున్న భర్తను సరిగా చూడటం లేదనే కోపంతోనే నిందితుడు ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *