– 168 మందికిపైగా మృతి
– వేలాదిగా క్షతగాత్రులు
– రిక్టారు స్కేలుపై 7.5గా నమోదు
న్యూఢిల్లీ,అక్టోబర్26(జనంసాక్షి): భూకంపం కారణంగా పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్‌ల్లో 160 మందికి పైగా మృత్యువాత పడ్డారు. పాకిస్థాన్‌లో కనీసం 130 మంది, ఆఫ్ఘనిస్థాన్‌లో దాదాపుగా 31 మంది మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. 1000మందికి పైగా గాయపడినట్లు సమాచారం. పలు చోట్ల భవనాలు, ఇళ్ల పైకప్పులు కూలి పడడంతో మృతుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ రోజు ఆఫ్ఘనిస్థాన్ -పాక్ సరిహద్దులోని హిందూకుష్ పర్వత ప్రాంతంలో 7.5 తీవ్రతతో సంభవించిన భూకంపం ప్రభావం ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్, భారత్‌లపైనా పడింది. పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్, పెషావర్, కరాచి, రావల్పిండి, లా¬ర్ తదితర ప్రాంతాల్లో తీవ్ర ప్రకంపనలు సంభవించాయి. పెషావర్‌లోని లేడీరీడింగ్ ఆస్పత్రిలో వంద మంది క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు. పాకిస్థాన్‌లోని ఖైబర్‌ఫంక్తువా ప్రావిన్స్, కొన్ని గిరిజన ప్రాంతాల్లో కలిపి 121 మంది మృతిచెందగా, పంజాబ్‌లో అయిదుగురు, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో నలుగురు మృతిచెందినట్లు పాక్ మీడియా వెల్లడించింది.
ఉత్తరాదిని వణికించిన భూకంపం
బయటకు పరుగుల తీసిన ప్రజలు
నేపాల్ భూకంప విలయం మరవక ముందే మరో భారీ భూకంపం చోటుచేసుకుంది. పాక్, అఫ్ఘన్ కేంద్రాలుగా ఈ భూకంపం హిందూకుష్ పర్వత శ్రేణుల్లో సంభవించింది. దీంతో పాక్, అప్ఘాన్‌లలో భారీ నష్టం సంబభవించింది. భారత్ ఉత్తరాదిని కూడా భూకంపం వణికించింది. పలు రాష్ట్రాల్లో భూకంపంతో ప్రజలు బయటకు పరుగుతీశారు. కార్యాలయాల నుంచి ప్రజలు బయటకు పరుగుల తీసారు. ప్రజలు వీధుల్లోకి వచ్చారు. భారత్‌లోని ఉత్తర, వాయువ్య ప్రాంతంలో పలు చోట్ల భూ ప్రకంపనలు సంభవించాయి. దిల్లీ, జమ్మూకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్, హరియాణా, జైపూర్, భోపాల్, ఛండీగఢ్, గుడ్‌గావ్ తదితర ప్రాంతాల్లో భూమి కంపించింది. ఈ ప్రకంపనలతో దిల్లీలోని ఏపీ భవన్ సహా పలు ప్రాంతాల్లో ఇళ్లు, కార్యాలయాల నుంచి ప్రజలు భయాందోళనలతో బయటకు పరుగులు తీశారు. ఈ భూకంప తీవ్రతకు దిల్లీలోని మెట్రోరైలు సేవలు, కశ్మీర్‌లో సమాచార వ్యవస్థ స్తంభించింది. ఆఫ్ఘనిస్థాన్‌లోని హిందూకుష్ పర్వత ప్రాంతంలో భూకంప కేంద్రం వద్ద రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 7.5గా నమోదైనట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ భూకంపం ధాటికి పాకిస్థాన్‌లో నలుగురు మృతిచెందినట్లు సమాచారం. ఈ మధ్యాహ్నం 2.40 గంటల సమయంలో ఈ ప్రకంపనలు సంభించినట్లు తెలుస్తోంది.
దిల్లీ మెట్రోరైలు సేవలు నిలిపివేత….పునరుద్దరణ
ఈ భూ ప్రకంపనలతో దిల్లీ మెట్రో రైలు సేవలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. మండీ హౌస్ వద్ద మెట్రో రైలు నుంచి ప్రయాణికులు బయటకు పరుగులు తీశారు. ఆఫ్ఘన్- పాక్ సరిహద్దుల్లో భూకంపం కారణంగా ముందు జాగ్రత్తగా నిలిపివేసిన దిల్లీలో మెట్రో రైలు సేవలను తిరిగి ప్రారంభించారు. ఆఫ్ఘనిస్థాన్-పాక్ సరిహద్దులో సంభవించిన భూకంప ప్రభావం దిల్లీపై పడడంతో ఇక్కడ భూ ప్రకంపనలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ముందుజాగ్రత్త చర్యగా కొద్దిసేపు మెట్రో రైలును నిలిపివేశారు. మెట్రో లైన్లు క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం సేవలను తిరిగి పునరుద్ధరించినట్లు మెట్రో రైలు సీనియర్ అధికారి వెల్లడించారు.
కాశ్మీర్లో స్తంబించిన సమాచార వ్యవస్థ
ఈ భూకంప తీవ్రతకు జమ్ముకశ్మీర్‌లో సమాచార వ్యవస్థ స్తంభించింది. శ్రీనగర్‌లో విద్యుత్, టెలిఫోన్ స్తంభాలు నేలకొరిగాయి. లాల్ చౌక్ ఫ్లై ఓవర్ దెబ్బతింది. కొండ చరియలు విరిగి పడటంతో జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారి నెం.1ఏని ఈ విషయమై ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ సీనియర్ అధికారి ఒకరు విూడియాతో మాట్లాడుతూ… ‘జమ్ము-శ్రీనగర్ రహదారిపైగల రామ్‌సూ సెక్టార్‌లో కురుస్తున్న వర్షాలకు భారీగా కొండచరియలు విరిగి పడ్డాయి. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(బీఆర్‌ఓ) రహదారిపై కొండ చరియల్ని తొలగించి ట్రాఫిక్‌ని పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తోంది. జమ్ము, శ్రీనగర్‌ల్లో ట్రాఫిక్ కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశాం. రహదారి పరిస్థితిని ఈ కంట్రోల్ రూంల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకోవచ్చు’ అని చెప్పారు. అయితే దీనికి భూకంపానికి సంబంధం ఉందా అన్నది అధికారులు వివరించలేదు.
ప్రధాని మోదీ ఆదేశం
ఉత్తర, వాయువ్య భారతంలో పలుచోట్ల సంభవించిన భూప్రకంపనలపై ప్రధాని నరేంద్ర మోదీ
స్పందించారు. అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్‌లకు సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఈ సందర్భంగా మోదీ ప్రకటించారు. వెంటనే బాధిత ప్రాంతాల్లో సాయం కోసం రంగంలోకి దిగాలని అధికారులను ఆదేశించారు.
ఆందోళన వద్దన్న కేజ్రీవాల్
భూకంపం వార్తల నేపథ్యంలో ప్రజలంతా ప్రశాంతంగా ఉండాలని ఎలాంటి భయాందోళనలకు గురికావల్సిన అవసరం లేదని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజీవ్రాల్ అన్నారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా ట్వీట్ చేశారు. సహాయక బృందాలు సంసిద్ధంగా ఉన్నాయని ఆందోళన చెందాల్సిన పని లేదని తెలిపారు. ఈ మధ్యాహ్నం ఆఫ్ఘనిస్థాన్‌లోని హిందూకుష్ పర్వత శ్రేణులు కేంద్రంగా భూకంపం సంభవించింది. దాని ప్రభావం వల్ల భారత దేశంలో దిల్లీ, జమ్ము కశ్మీర్, హర్యాణా, హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్ తదితర ఉత్తర భారత రాషాల్లో ప్రకంపనలు సంభవించాయి.
హిందూకుష్ పర్వత శ్రేణుల్లో భూకంపం
ఆఫ్ఘనిస్థాన్‌లోని హిందూకుష్ పర్వత శ్రేణుల్లో సోమవారం మధ్యహ్నం భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టరు స్కేలుపై 8.1గా నమోదయ్యిందని పాకిస్థాన్ వాతావరణశాఖ తెలిపింది. దీని కారణంగా పాకిస్థాన్, భారత్‌లలో భూ ప్రకంపనలు సంభవించాయి. భారత్‌లో జమ్మూకశ్మీర్, దిల్లీ, హర్యాణా, హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్‌ల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో ప్రజలు ప్రాణభయంతో ఇళ్లు వదిలి వీధుల్లోకి పరుగులు తీసారు. నిముషం పాటు భూమి కంపించిందని పలువురు తెలిపారు. ఇదిలా ఉండగా భారత వాతావరణ శాఖ ఈ భూకంప తీవ్రతను 7.5గా చెబుతుండగా, యూఎస్‌జీఎస్ కూడా 7.5గా నమోదయినట్లు ప్రకటించాయి. పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్, మరికొన్ని ప్రాంతాల్లో కూడా భూమి కంపించింది. పాక్‌లోని పెషావర్ నగరంలో భూకంపం కారణంగా భవనం కూలిపోయినట్లు సమాచారం. భూకంపం ధాటికి పాకిస్థాన్‌లో 29 మంది మృత్యువాత పడ్డారని ప్రాథమిక సమాచారం.ఆఫ్ఘనిస్థాన్‌లో జరిగిన తొక్కిసలాటలో 12మంది బాలలు మృత్యువాతపడ్డారు. అఫ్ఘాన్ జరమ్ ప్రాంతంలో 7.7 తీవ్రతతో, 213.5 కి.విూల లోతులో ఈ జు భూకంపం సంభవించినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌కు 250 కి.విూల దూరంలో ఉంది. ఆఫ్ఘనిస్థాన్‌లో భారీ భూకంపం కారణంగా పాకిస్థాన్, భారత్‌లలో భూ ప్రకంపనలు సంభవించాయి. ఆఫ్ఘనిస్థాన్‌లోని హిందూకుష్ ప్రాంతంలో 7.5 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఆఫ్ఘనిస్థాన్‌లో సంభవించిన భూకంప తీవ్రత నేపాల్‌పైనా పడింది. అక్కడి భూకంపం కారణంగా పాకిస్థాన్, భారత్‌తోపాటు, నేపాల్‌లోనూ పలు చోట్ల భూ ప్రకపంనలు సంభవించాయి. నేపాల్ రాజధాని కాఠ్‌మాండూ సహా పలు ప్రాంతాల్లో ప్రకపంనలు వచ్చినట్లు ది హిమాలయన్ పోస్ట్ వెల్లడించింది.
ఆఫ్ఘనిస్థాన్‌లో తొక్కిసలాట.. 12 మంది బాలికలు మృతి
ఆఫ్ఘనిస్థాన్‌లో భూకంపం కారణంగా జరిగిన తొక్కిసలాటలో 12 మంది పాఠశాల విద్యార్థినిలు మృతిచెందారు. భారీ భూకంపంతో టక్‌హర్ ప్రావిన్స్‌లోని తలుకాన్ నగరంలో పాఠశాలలో విద్యార్థులు భయాందోళనలతో బయటకు పరుగులు తీసే క్రమంలో తొక్కిసలాట జరిగింది. దీంతో 12 మంది మైనర్ బాలికలు మృతిచెందగా, 35 మంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. ఈ రోజు ఆఫ్ఘనిస్థాన్-పాకిస్థాన్ సరిహద్దులో హిందూకుష్ పర్వత ప్రాంతంలో 7.5 తీవ్రతతో భూకంపం
ఉత్తర భారతాన్ని వణికించిన భూ ప్రకంపనలు
ఉత్తర భారతదేశంలోని దిల్లీ, జమ్మూకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్‌లలో మధ్యాహ్నం భూప్రకంపనలు సంభవించాయి. ఆఫ్ఘనిస్థాన్‌లోని హిందూకుష్ ప్రాంతంలో భూకంప కేంద్రం వద్ద భూకంప తీవ్రత రిక్టర్‌స్కేల్‌పై 7.5గా నమోదైంది. ఈ నేపథ్యంలో ఉత్తర భారతాన్ని తాకిన భూకంపాల్లో తీవ్రమైన భూకంపాల వివరాల్ని ఒకసారి పరిశీలిస్తే.. 2015, మే 12 న నేపాల్‌లో 7.3 తీవ్రతతో సంభవించిన భూకంపం ప్రభావం.. దిల్లీ, పశ్చిమ్ బంగా, బిహార్, ఉత్తరప్రదేశ్‌లపై పడింది. ఈ భూకంపం ధాటికి భారత్‌లో 44 మంది మృతిచెందారు. 2015, ఏప్రిల్ 25 న నేపాల్‌లోని లమ్‌జంగ్ కేంద్రంగా 7.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈశాన్య రాష్ట్రాల, గుజరాత్‌పై దీని ప్రభావం పడింది. 2005, అక్టోబరు 8 న పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్ కేంద్రంగా 7.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీని ప్రభావం జమ్ము కశ్మీర్‌పై అధికంగా పడింది. 2001, జనవరి 26 న గుజరాత్‌లో 7.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూ విలయానికి వేల సంఖ్యలో ప్రజలు మృతిచెందారు. సోమవారం నాటి తీవ్రతతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. భూమి ఒక్కసారిగా కంపించడంతో జనాలు, ఉద్యోగులు తమ నివాసాల నుంచి బయటకు పరుగులు తీశారు. మైదాన ప్రాంతాలకు చేరుకున్నారు.





