Monday, 2 November 2026

భూమా అఖిలప్రియకు మూడు శాఖలు.. అవి ఏవేవంటే..

అమరావతి: ఏపీ కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియకు చోటు దక్కిన విషయం తెలిసిందే. నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు సీఎం చంద్రబాబు నేడు శాఖలను కేటాయించారు. ఈ నేపథ్యంలో అందరు మంత్రుల్లోకి అతిపిన్న వయస్కురాలైన భూమా అఖిలప్రియకు ఏ శాఖ కేటాయించారనే దానిపై సర్వత్రా ఆసక్తి వ్యక్తం అవుతోంది. మంత్రిగా ప్రమోషన్ పొందిన అఖిలప్రియకు పర్యాటక, తెలుగు భాష, సాంస్కృతిక శాఖలు కేటాయించారు. మొదటిసారి మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అఖిలప్రియ తనకు కేటాయించే బాధ్యతలను పూర్తి స్థాయిలో, చిత్తశుద్ధితో నిర్వర్తిస్తానని చెప్పిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *