భూములపై పెద్దల కన్ను 

కాకినాడ,మే8(జ‌నం సాక్షి):  జిల్లాలోని సారవంతమైన భూములపై కొందరు పెద్దలు కన్నేశారని, సెజ్‌ పేరుతో భూఆక్రమణలకు పాల్పడుతున్నారని  ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి జి.అప్పారెడ్డి ఆరోపించారు. రెండు పంటలు పండే భూములను ఆక్వా రంగంవైపు మళ్లిస్తూ, భూములను నాశనం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దివీస్‌ కంపెనీ, ఓఎన్జీసీ, పెట్రోకారిడార్‌ పేరుతో రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కోటానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వీటన్నింటిని పరిగణలోకి తీసుకుని రైతు సంఘం రాష్ట్ర మహాసభలో కాకినాడలో నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపారు. భూదురాక్రమణకు వ్యతిరేకంగా ఈ సభల్లో నిర్ణయాలు చేసి, పోరాటాలకు వెళ్లనున్నట్టు ప్రకటించారు. ఈ సభలకు అఖిల 
భారత రైతుల సంఘాల ప్రతినిధులు, వ్యవసాయ రంగ నిపుణులు, శాస్త్రవేత్తలు హాజరవుతారని తెలిపారు.

తాజావార్తలు