భూముల పై విచారణ చేయించాలి
విజయనగరం,ఆగస్ట్3(జనం సాక్షి): కొత్తవలస మండలంలో శుక్రవారం రాయల్ సిటి వెంచర్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. రాయల్ సిటి యజమాన్యం విూడియాను, సిపిఐ రాష్ట్ర నాయకులను అడ్డుకున్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి కామేశ్వర్‌రావుకు, యాజమాన్యానికి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. సిపిఐ రాష్ట్ర నాయకులు రామకృష్ణ మాట్లాడుతూ.. రాయల్ సిటి భూముల్లో 450 కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. ఈ భూముల విషయంలో జూడిషియల్ విచారణ చేయాలని డిమాండ్ చేశారు.
—————–