శ్రీకాకుళంలో పంద్రాగస్ట్‌ వేడుకలు

ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి

శ్రీకాకుళం,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లను జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రి పితాని సత్యనారాయణ, రవాణా శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, జిల్లా కలెక్టర్‌ కె ధనంజయ రెడ్డిలు శుక్రవారం పరిశీలించారు. వేడుకలకు పక్కగా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పితాని మాట్లాడుతూ.. ప్రస్తుతం జరుగుతున్న పనులపై సంతృప్తిని వ్యక్తం చేశారు. వేడుకల రోజున శ్రీకాకుళం సుందర పట్టణంగా తయారు కావాలని, రహదారులపై ఆక్రమణలు తొలగించాలని చెప్పారు. రహదారులపై చిల్లర వర్తకులను నిరోధించాలన్నారు. ట్రాఫిక్‌ సిగల్‌ వ్యవస్థను మెరుగుపరచాలన్నారు. అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. అన్నిజిల్లాల సమగ్ర అభివృద్ధే ముఖ్యమంత్రి సంకల్పమని, అందులో భాగంగా శ్రీకాకుళంలో స్వాతంత్య్ర దినోత్సవాలు జరుపుకోనున్నామని తెలిపారు.

 

తాజావార్తలు