Monday, 2 November 2026

భూ సేకరణ ఆర్డినెన్సుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం-అరుణ్‌ జైట్లీ

4

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 29(జనంసాక్షి) : భూ సేకరణ నిబంధలు సరళతరం ఆర్డినెన్స్‌కు కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపిందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ తెలిపారు. సోమవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ ఇక నిబంధనలు సరళతరం చేస్తామని అన్నారు. దీంతో పరిశ్రమలకు భూసేకరణ సులువుకానున్నదని ఆయన అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రణాళికేతర వ్యయంపై చర్చించామని, బొగ్గు గనుల అంశంపైనా చర్చించామని ఆయన పేర్కొన్నారు.

ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం నిర్వహిస్తున్న ప్రాజెక్టులకు సంబంధించిన భూములు, పేదల భూములకు మినహాయింపు ఉంటుందని అరుణ్‌జైట్లీ స్పష్టం చేశారు. ఢిల్లీలో అక్రమ కాలనీల క్రమబద్దీకరణకు కేబినెట్‌ ఆమోదముద్ర వేసిందని ఆయన తెలిపారు. భూసేకరణ చట్టంలో సవరణలకు కేంద్రం ఆమోదం తెలిపిందని ఆయన వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *