Wednesday, 4 November 2026

సర్కారుకు 132.84 కోట్ల డివిడెండ్లను అందించిన సింగరేణి

7హైదరాబాద్‌, జనవరి22(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సింగరేణి కాలరీస్‌ 132.84 కోట్ల రూపాయల డివిడెండ్‌ను అందజేసింది. గురువారంనాడిక్కడ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌ రావును కలిసిన సింగరేణి కాలరీస్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్‌ శ్రీధర్‌ డివిడెండ్‌ను అందజేశారు. 2013-14 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి కాలరీస్‌ 418 కోట్ల రూపాయల నికర లాభాన్ని నమోదు చేసుకుంది. కంపెనీ ఈక్విటీలో తెలంగాణ ప్రభుత్వానికి 15 శాతం వాటా ఉండటంతో ఈ మేరకు డివిడెండ్‌ను అందించింది. 2003-04లో లాభాలబాట పట్టిన సింగరేణి అప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి డివిడెండ్‌ను చెల్లిస్తూ వస్తోంది. ఆదిలాబాద్‌ జిల్లా జైపూర్‌ నిర్మిస్తున్న 1200 మెగావాట్ల థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టును 2015 డి సెంబర్‌ నాటికి పూర్తి చేస్తామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్‌కు శ్రీధ ర్‌ హావిూ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఇంధన శాఖ మంత్రి సి లక్ష్మారెడ్డి, కార్యదర్శి అరవింద్‌ కుమార్‌, సిఎం ముఖ్య కార్యదర్శి ఎస్‌ నర్సింగ రావు పాల్గొన్నారు.

బొగ్గు సరఫరాకు రైళ్లను పెంచండి

తెలంగాణలోని థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు నిరంతరాయంగా బొగ్గు సరఫరా చేసేందుకు గాను ఇప్పుడున్న గూడ్స్‌ రైళ్ల సంఖ్యను పెంచాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ పికె శ్రీవాస్తవను సింగరేణి కాలరీస్‌ కంపెనీ సిఎండి శ్రీధర్‌ కోరారు. ప్రస్తుతం ప్రతిరోజు సమకూరుస్తున్న 23 రైళ్లకు తోడు మరికొన్నింటిని కేటాయించాలని ఆయన రైల్వే జిఎంకు విజ్ఞప్తి చేశారు. ఆదిలాబాద్‌ జిల్లాలోని జైపూర్‌ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రానికి బొగ్గు సరఫరాకు, బేతంపూడి-కోయగూడెం మధ్య రైల్వేలైన్‌ ప్రాజెక్టు డిపిఆర్‌లను ఆమోదించాలని అభ్యర్థించారు. బెల్లంపల్లి గనుల నుంచి బొగ్గు సరఫరాను వేగిరం చేసేందుకు ఆసిఫాబాద్‌ సైడింగ్‌ లైన్‌ అవసరాన్ని వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *