Wednesday, 4 November 2026

మంత్రి పద్మారావు అర్ధరాత్రి పర్యటన

3hxamt77చినుకు పడితే చాలు… హైదరాబాద్ నగరమంతా…జలమయమౌతుంది. నాలాలు పొంగిపొర్లుతాయి. లోతట్టుప్రాంతాలన్నీ సముద్రాన్ని తలపిస్తున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో…నగరం పరిస్థితి దారుణంగా తయారైంది. నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో రెండు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో మంత్రి పద్మారావు అర్ధరాత్రి నగరంలో పర్యటించారు. లోతట్టు ప్రాంతాలతోపాటు నాలాలను పరిశీలించారు. వర్షాలు పడితే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను సూచించారు. ఇప్పటికే జీహెచ్ ఎంసీ నుంచి 75టీమ్స్ ను ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు.

అర్థరాత్రి 12గంటల నుంచి తెల్లవారుజాము వరకు మంత్రి పద్మారావు నగరంలో పర్యటించారు. ముంపు పరివాహాక ప్రాంతాలైన ముషీరాబాద్, సికింద్రాబాద్ లో ఉన్న నాలాలను పరిశీలించారు. రాంనగర్, అంబర్ నగర్, మహ్మద్ నాలా, భవానీ నగర్ , సాయినగర్ , ఫతే నగర్, ఇసుకబావి, సిరిపేరం కాలనీ, బేగంపేట మెయిన్ నాలా, బ్రహ్మణవాడ, ఇందిరమ్మనగర్, లాల్ పేట్ ప్రాంతంలో ఉన్న నాలాలు మంత్రి పరిశీలించారు.

వర్షాలు పడినప్పుడే సహాయక చర్యలు చేపట్టడం కాకుండా….శాశ్వత పరిష్కారం కోసం సీఎం కేసీఆర్ ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. హైదరాబాద్ నగరాన్ని గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దడంలో భాగంగా చర్యలు చేపట్టామన్నారు. నాలాల స్థితిగతులపై ఇవాళ సాయంత్రం సచివాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *