ఏంజియోప్లాస్టీ నిర్వహించినట్లు సమాచారం
న్యూఢిల్లీ డిసెంబర్ 13 (జనంసాక్షి) : రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి తీవ్ర అస్వస్థతకు గురైయ్యాడు. రాష్ట్రపతిని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫెరల్ ఆస్పత్రికి తరలించారు. ఆయన గుండెకు రక్తాన్ని సరఫరా చేసే కరోనరి ఆర్టరీలో బ్లాక్‌జీ ఉండడంతో వృద్దాప్యాన్ని దృష్టిలో ఉంచుకొని వైద్యులు ఆపరేషన్ లేని చికిత్సకు పూనుకున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగానేఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆస్పత్రిలో చేరిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఏంజియోప్లాస్టీ నిర్వహించినట్టు సమాచారం. ప్రణబ్‌కు గుండె సంబంధిత పరీక్షలు చేశారు. రాష్ట్రపతికి చికిత్స
చేస్తున్న వైద్యులు ఒక రోజు ఆస్పత్రిలో ఉండటం మంచిదని ఆయనకు సలహా ఇచ్చారు. శుక్రవారం ఆయన జన్మదిన వేడుకలలో అంతరంగాన్ని ఆవిష్కరిస్తు ద డ్రమాటక్ డికేట్ పుస్తకావిష్కరణ చేసిన విషయం తెలిసిందే. ఇదే రోజున ఆయన 79వ సంవత్సరంలోకి అడుగు పెట్టారు.





