అనంతపురం,మార్చి3(జనంసాక్షి): పట్టు రైతులకోసం ఒకరోజు వర్క్ షాపును ఏర్పాటు చేశారు. ఇందులో అనేక సమస్యలను చర్చిస్తారు. ఈనెల 5న మడకశిరలోని యాదవ కళ్యాణమండపంలో ఉదయం 11 గంటలకు పట్టు పరిశ్రమ రైతులకు ఒక రోజు వర్క్‌షాపు ఏర్పాటుచేశామని పట్టు పరిశ్రమశాఖ అధికారులు తెలిపారు. కార్యక్రమానికి సెంట్రల్‌సిల్క్ బోర్డు చైర్మన్ బిసేగౌడ్, పట్టుశాఖ కమిషనర్ ఉషారాణి, సిల్క్‌బోర్డు డైరెక్టర్ శివప్రసాద్, జిల్లా కలెక్టర్ కోనశశిధర్, రాష్ట్ర మంత్రులు పరిటాల సునీత, ప్లలె రఘునాథరెడ్డి, ఎంపీ నిమ్మలకిష్టప్ప, ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, ఎమ్మెల్యే ఈరన్న ముఖ్య అథితులుగా హాజరవుతున్నారని జేడీ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని పట్టుశాఖ రైతులు సద్వినియోగం చేసుకోవాలని జేడీ కోరారు.




