మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ర్యాలీ
తిరుపతి,జూలై10:(జనం సాక్షి ): విద్యార్థులు,యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని మంత్రి జవహర్ పిలుపునిచ్చారు. దీంతో తమ భవిష్యత్‌ను నావనం చేసుకోవద్దన్నారు. మత్తు పదార్థాల నిషేధంపై తిరుపతిలో మంగళవారం ర్యాలీని ఘనంగా నిర్వహించారు. మంత్రి జవహర్ పచ్చజెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీకి ముందుగా వాయిద్యాల బృందం వాయిద్యాలు వాయిస్తూ నడిచారు. మాదకద్రవ్యాలు ఇచ్చే ఆనందం తాత్కాలికం అనే ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, పోలీసులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.