మహిళపై దాడుల నిరోధానికి రక్షిత టీమ్‌లు: అడిషనల్ ఎస్పీ
కడప,జూలై10:(జనం సాక్షి ): మహిళలు, బాలికలపై జరిగే నేరాలను నిరోధించడానికి ప్రత్యేకంగా కడప జిల్లా పోలీసులు రక్షిత టీంను ఏర్పాటు చేశారని రాజంపేట అడిషనల్ ఎస్పీ బి.లక్ష్మీ నారాయణ తెలిపారు. మంగళవారం కడప జిల్లా రైల్వే కోడూరు పట్టణంలో ప్రైవేటు పాఠశాలల, కళాశాలల విద్యార్థిని, విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో రాజంపేట అడిషనల్ ఎస్పీ బి.లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ…జిల్లాలో ఈవ్ టీజింగ్ , ర్యాగింగ్, గృహహింస, పిల్లలు, మహిళలపై లైంగిక దాడులు, పనిచేసే ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులు, బాల్య వివాహాలు నిరోధించడానికి కడప జిల్లాలో ప్రత్యేకంగా ఈ రక్షిత టీంను జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ ర్యాలీలో సిఐ సాయినాథ్, ఎస్సైలు వెంకటేశ్వర్లు , భక్తవత్సలం, పోలీసు సిబ్బంది, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు, కరస్పాండెంట్లు పాల్గొన్నారు.