మద్యం మత్తులో పురుషాంగం కోసుకున్న వ్యక్తి

 

ఆస్పత్రికి తరలింపు..చికిత్స చేస్తున్న వైద్యులు

అనంతపురం,జూన్‌8(జ‌నం సాక్షి): అనంతపురం జిల్లా రాయదుర్గంలో శుక్రవారం ఓ వ్యక్తి మద్యం మత్తులో పురుషాంగాన్ని కోసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ¬టల్‌లో పని చేసే గోవిందరాజులు (36) కుటుంబంతో కలిసి గొందిబావి ప్రాంతంలో జీవనం సాగిస్తున్నాడు. తన భార్య పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లగా అతడి తల్లి అక్క వాళ్ల ఇంటికి వెళ్లింది. దీంతో ఒంటరిగా ఉన్న గోవిందరాజులు గురువారం సాయంత్రం  మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. మద్యం మత్తులో తన పురుషాంగాన్ని కత్తితో కోసుకున్నాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో నొప్పి భరించలేక కేకలు వేశాడు. ఇంటి పక్కన ఉన్న వ్యక్తి అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. రాయదుర్గంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికత్స పొందుతున్నాడు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని సమాచారం.