Tuesday, 3 November 2026

మద్యం మత్తులో భార్య హత్య

నెల్లూరు, సెప్టెంబరు 7 : పీకల దాకా మద్యం తాగి భార్యను కొట్టి చంపిన భర్త ఉదంతం నెల్లూరు జిల్లాలో జరిగింది. కోట మండలం రాఘవాపురంలో అంకయ్య అనే వ్యక్తి మద్యం మత్తులో భార్య ఆదిలక్ష్మమ్మను కొట్టి చంపాడు. భార్యను హతమార్చిన భర్త అంకయ్య పరారయ్యాడు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *