మైనర బాలికపై బాబాయి అత్యాచారం
ప్రకాశం, సెప్టెంబరు 7 : ఒంగోలులో దారుణం జరిగింది. ఓ మైనర్‌పై బాబాయి వరుస అయ్యే వ్యక్తి అత్యాచారం చేశాడు. మర్రిపూడి మండలం అయ్యవారిపల్లెకు చెందిన ఓ మైనర్ కందకూరి ఎస్సీ హాస్టల్‌లో ఉండి చదువుకుంటోంది. ఆరోగ్యం బాగోలేదని తనకు బాబాయి వరుస అయ్యే దత్తయ్యకు చెప్పింది. దీంతో ఆస్పత్రికి తీసుకెళ్తానంటూ ఆ మైనర్‌ను దత్తయ్య ఒంగోలుకు తీసుకువచ్చాడు. మాయమాటలు చెప్పి లాడ్జికు తీసుకెళ్లి అక్కడ ఆమెపై అత్యాచారం చేసి పరారయ్యాడు. ఆందోళనకర పరిస్థితిలో ఉన్న బాలికను గమనించి లాడ్జి సిబ్బంది వెంటనే ప్రభుత్వాస్పత్రిలో చేర్చించారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.