Tuesday, 3 November 2026

మద్యాన్ని నిషేధించాలంటూ మహిళల ఆందోళన

5tlui26oవి మాడుగుల, ఆగస్టు 24 : విశాఖ జిల్లాలోని మండలకేంద్రమైన వి. మాడుగుల గ్రామంలో మద్యాన్ని నిషేధించాలని డిమాండు చేస్తూ మహిళలు ఆందోళన చేశారు. సెయింట్‌ ఆన్స్‌ నవజీవన్‌ స్రవంతి మహిళాసంఘం ఆధ్వర్యంలో 500 మంది మహిళలు ఆర్టీసీ బస్టాండు వరకు ఊరేగింపుగా వెళ్లి ధర్నా చేశారు. గ్రామంలో మానవహారంగా ఏర్పడి మద్యాన్ని నిషేధించాలని నినాదాలు చేశారు. గ్రామంలోని మద్యం దుకాణాన్ని బంద్‌ చేయించారు. ఈ కార్యక్రమంలో జూనియర్‌ కళాశాల విద్యార్థినులు కూడా పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *