బాబూ.. నీకు హైదరాబాద్‌లో ఉండే అర్హత ఉందా?
మంత్రి హరీశ్ సూటి ప్రశ్న
హైదరాబాద్, డిసెంబర్ 3 (జనంసాక్షి) : మద్రాస్‌కు నీళ్ళస్తరు.. హైదరాబాద్‌కు మాత్రం వద్దా? అని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. చంద్రబాబుకు హైదరాబాద్‌లో నివసించే నైతిక అర్హత లేదని విమర్శించారు. ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేయాలని చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. బుధవారం హరీష్‌రావు తెలంగాణ భవన్లో విూడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ప్రాజెక్టులపై చంద్రబాబు కుట్రలు చేస్తుంటే తెలంగాణ టీడీపీ నేతలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు అడుగులకు మడుగులొత్తుతున్నారని హరీష్ ఆరోపించారు. చంద్రబాబు చెప్పేదొకటి…చేసేది మరొకటని హరీష్‌రావు విమర్శించారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. హైదరాబాద్‌లో పారిశ్రామిక వేత్తలు పెట్టుబడులు పెట్టకుండా బాబు కుట్రలు చేస్తున్నారన్నారు. ప్రతిరోజు కుట్రలు చేసే చంద్రబాబుకు హైదరాబాద్లో ఉండే హక్కు ఉందా అని హరీష్ రావు ప్రశ్నించారు. చంద్రబాబుది విష కౌగిలి అని… ఆంధ్రప్రదేశ్ నుంచి మద్రాసుకు నీళ్లు ఇస్తున్న చంద్రబాబు…హైదరాబాద్ కు కృష్ణ జలాలు రాకుండా అడ్డుకుంటున్నారన్నారు. హైదరాబాద్లోనే ఉంటూ ఇటువంటి చర్యలకు పాల్పడటం సిగ్గుచేటు అని హరీష్ రావు మండిపడ్డారు. తెలంగాణకు చంద్రబాబు అన్ని రకాలుగా అన్యాయం చేయాలని చూస్తున్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. దీనిపై రేవంత్ రెడ్డి ఏమంటార.. బాబు కుట్రలను అడ్డుకోండి…లేదా రాజీనామా చేయండని డిమాండ్ చేశారు. ఎన్ని కుట్రలు చేసినా హైదరాబాద్ కు మంచినీరు అందించి తీరుతామన్నారు. హైదరాబాద్‌కు కావాల్సిన నీటికేటాయింపులను గత ప్రభుత్వం చేయలేదు, హైదరాబాద్ కృష్ణాబేసిన్‌లో ఉంది, పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేయాలని చంద్రబాబు కేంద్రానికి లేఖ రాసారని హరీశ్‌రావు తెలిపారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రాంత టీడీపీ నేతలు కళ్లు తెరిచి …చంద్రబాబును నిలదీయాలని సూచించారు. టీటీడీపీ నేతలు తెలంగాణ ప్రజల పక్షాన ఉంటారో చంద్రబాబు పక్షాన ఉంటారో తేల్చుకోవాలన్నారు. ఎర్రబెల్లికి, రేవంత్‌రెడ్డికి రైతులపై ప్రేముంటే చంద్రబాబు కుట్రలపై నిలదీయాలని డిమాండ్ చేశారు.కరెంటు రాకుండా కుట్రలు చేసి రైతుల ఆత్మహత్యకు చంద్రబాబే కారణమన్నారు. ఓర్వలేనితనమున్న చంద్రబాబు పక్షాన మాట్లాడుతున్న టీటీడీపీ నేతలను ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. ఎవరు అడ్డుపడ్డా పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు కట్టితీరుతామని హరీష్ రావు స్పష్టం చేసారు.





