Monday, 2 November 2026

సాద్వి రాజీనామా చేయాలి

4

రాజ్యసభలో విపక్షాల పట్టు

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 3 (జనంసాక్షి)  : కేంద్ర ఆహార శుద్ది పరిశ్రమ సహాయ  మంత్రి సాధ్వి నిరంజన్‌జ్యోతి రాజీనామా చేయాలని విపక్షాలు పట్టుబట్టాయి. ఆమె వ్యాఖ్యలపై రాజ్యసభలో మరోసారి దుమారం చెలరేగింది. బుధవారం ఉదయం రాజ్యసభ ప్రారంభమైన వెంటనే సాధ్వి వ్యాఖ్యలపై విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. సభా కార్యక్రమాలకు అడ్డుతగిలారు. సాధ్వి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. దీనిపై ¬ం మంత్రి రాజ్‌నాధ్‌సింగ్‌ సభకు వివరణ ఇచ్చినప్పటికీ విపక్షాలు శాంతించలేదు. ఈ సందర్భంలో  కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ సాధ్వి రాజకీయాలకు కొత్త అని, ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదు అని అన్నారు. గతంలోనూ యూపీఏ హయాంలో వాజ్‌పేయిపై ఓ మంత్రి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని గుర్తుచేశారు. క్షమాపణ చెప్పేందుకు అప్పట్లో ఆ మంత్రి నిరకరిస్తే ప్రధాని మన్మోహన్‌ సభకు క్షమాపణ చెప్పారని వెంకయ్య వివరించారు. మంత్రి సాధ్వి రాజీనామా చేసే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే సాధ్వి రాజీనామాకు విపక్షాలు పట్టుబట్టాయి. వెల్‌లోకి దూసుకెళ్లి ఆందోళనకు దిగడంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో డిప్యూటీ చైర్మన్‌ సభను పదినిమిషాల పాటు వాయిదా వేశారు. తిరిగి సభ ప్రారంభమైన తరువాత కూడా విపక్షాలు ఆందోళనలు కొనపాగించడంతో చైర్మన్‌ గురువారానికి సభను వాయిదా వేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *