Thursday, 5 November 2026

మన్మోహన్‌సింగ్‌కు సమన్లు

qlksd4rkబొగ్గు కుంభకోణానికి సంబంధించి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు ప్రత్యేక సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది. ఎటువంటి పారదర్శకత లేకుండా గనుల తవ్వక హక్కులను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టినట్లు వచ్చిన ఆరోపణలపై మన్మోహన్ తో పాటు ఇతర ఐదుగురు వ్యక్తులను ఏప్రిల్ 8న కోర్టుకు హాజరు కావాలంటూ సీబీఐ ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది. సమన్లు జారీ అయిన వారిలో హిందాల్కో కంపెనీ, కుమార మంగళం బిర్లా, పీసీ ఫరేఖ్ ఉన్నారు. యూపీఏ హయాంలో మన్మోహన్ సింగ్ బొగ్గు శాఖకు ఇంచార్జిగా వ్యవహరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *