Wednesday, 4 November 2026

మన బంధం ధృడమైనది

4

రష్యా రక్షణమంత్రితో ప్రధాని మోదీ

దిల్లీ,జనవరి21(జనంసాక్షి): భారత, రష్యాల మధ్య సంబంధాలు కాల పరీక్షను తట్టుకుని మరీ నిలిచాయని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. గత నెలలో రష్యా అధ్యక్షుడు వ్లాద్‌మిర్‌ పుతిన్‌ భారత పర్యటన ద్వారా ఇరుదేశాల సంబంధాల్లో నూతన ఒరవడి నెలకొందని వివరించారు. బుధవారమిక్కడ రష్యా రక్షణ మంత్రి షెర్జే షోయ్గు.. ప్రధాని మోదీతో సమావేశమైన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యాలో ఈ ఏడాది జరిగే ఏడో ‘బ్రిక్స్‌’ సదస్సు, ద్వైపాక్షిక వార్షిక సమావేశాల్లో పాల్గొనేందుకు ఎదురు చూస్తున్నానని మోదీ రష్యా మంత్రికి చెప్పినట్లు ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. గత నెలలో రష్యా అధ్యక్షుడు వ్లాద్‌మిర్‌ పుతిన్‌ భారత పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య 20 ఒప్పందాలు జరిగిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *