Monday, 2 November 2026

.మన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి.

4
-భాజపా పార్లమెంటరీ బోర్డు సమావేశంలో మోదీ

న్యూదిల్లీ, డిసెంబర్‌ 24(జనంసాక్షి)-

పార్లమెంట్‌ లో ప్రభుత్వం ఆమోదించిన బిల్లుల గురించి ప్రజలకు తెలపాలని బీజేపీ ఎంపీలను ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. ప్రభుత్వం సాధించిన విజయాలను బాగా ప్రచారం చేయాలని సూచించారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మంగళవారం మోదీ మాట్లాడారు.

లోక్‌సభ, రాజ్యసభలో ప్రభుత్వం ఆమోదించిన బిల్లుల గురించి ప్రజలకు వివరించాలని ఎంపీలను కోరారు. రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. విపక్షాల వలలో

పడకుండా అభివృద్ధి పనులు, సుపరిపాలనపై దృష్టి పెట్టాలని మోదీ సూచించారు. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల నాటికి ఎంపీలు విషయ

ఝార్ఖంఢ్‌, కాశ్మీర్‌ ఎన్నికల్లో సాధించిన ఫలితాలల నేపథ్యంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక సాధించిన ఘన విజయాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ శ్రేణులకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఢిల్లీలోని భారతీయ జనతాపార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ పార్లమెంటరీ బోర్డు మీటింగ్‌లో ప్రధాని పాల్గొన్నారు. పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షాతోపాటు పలువురు పార్లమెంటరీ బోర్డు నేతలు ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ సాధించిన ఈ విజయాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు కార్యచరణ రూపొందించాలని మోదీ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. అంతేకాక ట్విట్టర్‌లో కూడా జమ్మూకశ్మీర్‌, జార్ఖండ్‌ బీజేపీ కార్యకర్తలను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. బీజేపీ కార్యక్తలు కష్టపడి నిస్వార్థంగా అంకితభావంతో పనిచేయడం వల్లే ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల్లో తమ పార్టీకి సానుకూల ఫలితాలు వచ్చాయని అన్నారు. బీజేపీకి బాసటగా నిలిచిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. సుస్థిర ప్రభుత్వ కాంక్షతో జార్ఖండ్‌ ప్రజలు బీజేపీకి ఓటు వేశారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసంతో జమ్మూకశ్మీర్‌ ప్రజల పెద్ద ఎత్తున ఓటింగ్‌ పాల్గొన్నారని, వారిని ధన్యవాదాలు తెల్పుతున్నానని మోదీ ట్వీట్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *