మరుగదొడ్ల నిర్మాణానికి తక్షణ చర్యలు

చిత్తూరు,జూన్‌21(జ‌నం సాక్షి): స్వచ్ఛభారత్‌ా స్వచ్ఛఆంధ్రాలో భాగంగా ఏర్పాటు చేస్తున్న మరుగుదొడ్లలక్ష్యం సాధనకు ప్రతి అధికారి కృషి చేయాలని అధికారులు ఆదేశించారు. మరుగుదొడ్ల నిర్మాణం పూర్తిచేసిన వారికి వెంటనే బిల్లులు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాం. రాష్ట్రంలో జిల్లాను మొదటి స్థానంలో నిలపడానికి ప్రణాళికలు తయారు చేసుకుని అందుకనుగుణంగా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా ప్రజలకు సమస్య ఎక్కడైనా తలెత్తితే వెంటనే పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీటిని అందించే బాధ్యత ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖకు ప్రభుత్వం అప్పగించిందన్నారు. అక్కడ విద్యార్థులకు అవసరమైన మరుగుదొడ్లు నిర్మించడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.