Tuesday, 3 November 2026

మరో మూడు రోజుల్లో కేరళ తీరాన్ని తాకనున్న రుతుపవనాలు

విశాఖపట్నం : మరో 3,4 రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నెల 17న భారత ఉపఖండంలోకి ప్రశేశించిన రుతుపవనాలు బంగాళాఖాతంలో మరింతగా విస్తరించడానికి అనుకూల వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. మరో 48 గంటల్లో అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, మాల్దీవులు, బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాల్లో రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉంది. అనుకున్న విధంగా నైరుతి విస్తరిస్తే జూన్‌ రెండు, మూడు తేదీల్లో కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉంది. రెండో వారంలో మన రాష్ట్రంలో నైరుతి జల్లులు కురుస్తాయి. ఈ ఏడాది రుతుపవనాల వల్ల దేశంలో సాధరణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అశాభావం వ్యక్తం చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *