Monday, 2 November 2026

మలిదశ పోలింగ్‌ ప్రశాంతం

5

ఝార్ఖండ్‌లో 64శాతం, జమ్మూకాశ్మీర్‌లో 71శాతం

హైదరాబాద్‌, డిసెంబర్‌ 2 (జనంసాక్షి) : మలిదశ పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఝార్ఖండ్‌లో 64శాతం, జమ్మూకాశ్మీర్‌లో 71శాతం పోలింగ్‌ నమోదైంది. ఝార్ఖండ్‌, జమ్మూకశ్మీర్‌ రాష్గాల రెండో దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ మంగళవారం ప్రశాంతంగా ముగిసింది. ఝార్ఖండ్‌లో 64.49 శాతం పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఈ దశలో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులు అర్జున్‌ ముండా, మధుకోడాలతో పాటు మరో ముగ్గురు మంత్రులు పోటీలో ఉన్నారు. 20 నియోజకవర్గాల్లో పోటీలో ఉన్న 223 మంది అభ్యర్థుల్లో 35 మంది మహిళలు ఉన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు కావడంతో కట్టుదిట్టమైన భద్రత మధ్య పోలింగ్‌ను పూర్తిచేశారు. జమ్మూకశ్మీర్‌లోని 18 నియోజకవర్గాల్లో కూడా పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. రెండోదశలో 71శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *