Tuesday, 3 November 2026

సీనియర్‌ కాంగ్రెస్‌ నేత అంతులే కన్నుమూత

6

ముంబై, డిసెంబర్‌ 2 (జనంసాక్షి) : సీనియర్‌ కాంగ్రెస్‌ నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఏఆర్‌.అంతులే(85) మంగళవారం ఉదయం కన్నుమూసారు. గత కొంత కాలంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న అంతులే రెండు రోజుల క్రితం  బ్రీచ్‌ కాండీ ఆసుపత్రిలో  చేరారు. మంగళవారం వైద్యులు ఆయనకు డయాలసిస్‌ చేస్తున్న సమయంలో అంతూలే ఆరోగ్య పరిస్థితి ఒక్కసారిగా విషమించింది. వైద్యులు అత్యవసర చికిత్సంచినా ఫలితం లేకపోయింది. అంతూలే చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతిచెందినట్లు బ్రీచ్‌ కాండీ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. బుధవారం రాయ గఢ్‌ లోని ఆయన సొంత గ్రామం అంబెట్‌లో అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు మేనల్లుడు ముస్తాక్‌ అంతులే తెలిపారు.1980 జూన్‌ 9వ తేదీన మహారాష్ట్ర ఎనిమిదో సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆయన రెండేళ్లు కూడా పదవిలో కొనసాగలేదు. ఇందిరా ప్రిస్థాన్‌ ట్రస్టు ద్వారా  అంతులే అవినీతికి పాల్పడినట్లు హైకోర్టు నిర్దారించడంతో 1982 జనవరి 13న ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. యుపిఎ 1 ప్రభుత్వంలో అంతూలే కేంద్ర మంత్రిగా పని చేసారు. అంతూలే మృతి పట్ల కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీ రాహుల్‌, పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *