Tuesday, 3 November 2026

మోదీ ఓ నియంత

2
భాజాపా నేతల వివాదాస్పద వ్యాఖ్యలపై నోరు మెదపకపోవడం ఓ వ్యూహం

ఏఐసీసీ చీఫ్‌ సోనియా

హైదరాబాద్‌ జనవరి13(జనంసాక్షి): ప్రధాని నరేంద్ర మోదీ నియంతృత్వ దోరణిలో నిర్ణయాలు తీసుకుంటున్నారనీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ మంగళవారం తీవ్రంగా విమర్శించారు. ఆపార్టీ నేతలు ఇష్టం వచ్చినట్లు వివాదాస్సద వ్యాఖ్యాలు చేస్తు గంధరగోళం సృష్టిస్తున్న మోదీ మాత్రం స్పందించడం లేదని, వారి వ్యాఖ్యాలను ఖండించకుండా మౌనం పాటిస్తున్నారనీ సోనియా మండిపడ్దారు. భూసేకరణ చట్టం నిర్వీర్యం చేస్తూ రైతుల ప్రయోజనాలు ఆయా భూముల హక్కు దారుల హక్కులను మంటగలుపుతూ.. ఆర్డినెన్స్‌ అడ్డగోలుగా తెచ్చారనీ ఆమె తీవ్రంగా విమర్శలు గుప్పించారు. దేశవ్యాప్తంగా భూసేకరణ చట్టంపై ఆర్డినెన్స్‌కు  వ్యతిరేకంగా ఆందోళన చేపట్టడానికి తాము సిద్దంగా ఉన్నామనీ ఈ విషయంలో రాజకీయాలకు అతీతంగా అందరూ కలసి రావాలని అమె పిలుపునిచ్చారు. సంక్షేమ కార్యక్రమాలను మోదీ నీరుగార్చుతున్నారని సోనియా ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *