Wednesday, 4 November 2026

మహబూబ్ నగర్ జిల్లాలో వడగండ్ల వర్షం

1gfseyy3మహబూబ్ నగర్: జిల్లాలో వడగండ్లతో కూడిన వర్షాలు కురిశాయి. గత అర్ధరాత్రి గంటపాటు కొడంగల్ నియోజకవర్గంలో కుండపోత వర్షం పడింది. నారాయణపేట, మహబూబ్ నగర్, కల్వకుర్తి, వనపర్తి నియోజకవర్గాల్లో అక్కడక్కడ జల్లులు కురిశాయి. అకాల వర్షానికి వరి, మామిడి పంటకు తీవ్రనష్టం వాటిల్లింది. వెల్ధండ మండలం రాచూరులో పిడుగుపాటుకు రెండు కాడెద్దులు చనిపోయాయి. నష్టపోయిన పంటకు పరిహారం చెల్లించాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *