Tuesday, 3 November 2026

మహా ఒప్పందంతో తెలంగాణ సస్యశ్యామలం

C

– జనం గుండెల్లో కేసీఆర్‌

– కొప్పుల

హైదరాబాద్‌, మార్చి12(జనంసాక్షి):యావత్‌ ప్రపంచంలో అనతికాలంలో నిరుపేదల గుండెల్లో గూడు కట్టుకున్న సీఎం ఎవ్వరులేరని అది కేవలం కేసీఆర్‌కు మాత్రమే సాధ్యమైందని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ కొప్పుల ఈశ్వర్‌ వెల్లడించారు. ఆయన శనివారం గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చను ప్రారంభించారు. ఈసందర్భంగా కొప్పుల మాట్లాడుతూ తినడానికి తిండిలేక, చేతిలో చిల్లి గవ్వలేక వృద్దాప్యంలో అనేక అవస్థలు పడుతున్న నిరుపేద వృద్దులకు వితంతువులకు, వికలాంగులకు చేతినిండా డబ్బులు కనిపించేలా వెయ్యి, 1500 రూపాయల పెన్షన్‌ను ప్రవేశపెట్టి నిర్విఘ్నంగా అమలు చేస్తున్న సీఎం కేసీఆర్‌ అన్నారు. దీంతో ఆయనను నేడు ఏ గ్రామంలోకి వెల్లినా కూడా తమ పెద్ద కొడుకుగా భావిస్తున్నారే తప్ప మరోటి లేదన్నారు. అంతేకాక ప్రతి కుటుంబంలో ఒక్కొక్కరికి ఆరుకిలోల చొప్పున బియ్యం ఇవ్వడంతో కుటుంబం మొత్తం రెండు పూటలా కడుపునిండా భోజనం చేస్తున్నారన్నారు. గతంలో ఎన్నో నియంత్రణలతో అమలుచేసి ఎవ్వరికి కూడా ఒక్క పూట కూడా బోజనం అందేది కాదని ప్రజలు చర్చించుకుంటున్నారన్నారు. హాస్టల్లలో సన్నబియ్యంతో విద్యార్థుల జీవితాలను మెరుగు పరిచేందుకు ఇంటివైపు దృష్టి మరలకుండా మంచి విద్యను ఆర్జించేలా చేస్తున్నాడన్నారు. అలాగే దళిత, ముస్లిం యువతులకు 51 వేల రూపాయలను కేసీఆర్‌ కళ్యాణ లక్ష్మి, షాదిముబారక్‌ పేరుతో ఇవ్వడం జరుగుతుందన్నారు. అలాగే వచ్చే ఒకటో తేదీనుంచి బీసీలకు కూడా ఈపథకాన్ని విస్తరిస్తున్నాడన్నారు. ప్రతి ఇంటికి మిషన్‌ భగీరథ పేరుతో నల్లా నీరు ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఆయాచోట్ల ఇప్పటికే ఈ పథకానికి సంబందించిన పనులు పూర్తి దశకు చేరుకున్నాయన్నారు. మూడెల్లలో ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్లతోనే నీరు ఇవ్వడం జరుగుతుందన్నారు. మంచి నీరు ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడుగనని చెప్పిన ఏకైక సీఎం కేసీఆర్‌ మాత్రమేనని ఆయన కొనియాడారు. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలుచేసినా సంక్షేమ రంగంలో దేశంలోనే తెలంగాణా రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని దీనికి కేంద్రం లెక్కలు చూస్తే సరిపోతుందన్నారు. దేశంలోనే రెండో అతి పెద్ద నగరంగా ఎదుగుతున్న హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం ముందుకుపోతుందన్నారు. ఇటీవల గ్రేటర్‌ హైదరాబాద్‌, వరంగల్‌, అచ్చంపేట, వరంగల్‌ ఎంపి, మెదక్‌ జిల్లా నారాయణ్‌ఖేడ్‌ ఎమ్మెల్యే ఉపఎన్నికలలో టీఆర్‌ఎస్‌ అఖండ మెజార్టీతో గెలిచిందంటే ప్రజల ఆదరాభిమానాలు ఏమేరకు తమ ప్రభుత్వానికి ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు. తమ పాలనకు గీటురాయిగానే ఫలితాలన్నారు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు విమర్శించడం మానుకుని ప్రభుత్వానికి సహకరించాల్నారు. సుపరిపాలనకే ప్రజలు పట్టం గడుతారని మరోసారి ఈ ఎన్నికలు నిరూపించాయన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని మాయ మాటలు చెప్పినా కూడా పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణ జరుగాలన్నారు. గోదావరినది జలాలే మనకు ఆదారమని, రైతుల అవసరాలకోసం తెలంగాణా ప్రభుత్వం మహారాష్ట్రతో వ్యూహాత్మకంగా ఓప్పందం చేసుకుందన్నారు. ఆదిలాబాద్‌ జిల్లాలో దీనివల్ల 58వేల ఎకరాలకు సాగు నీరు అందిస్తామన్నారు. చనఖా-కొరటా డ్యామ్‌ నీటిని వినియోగించుకునేందుకు అనుమతి పొంది ప్రభుత్వం విజయం సాదించిందన్నారు. అక్కరకు రాని ప్రాజెక్టులను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.

ప్రాణహిత-చేవెల్ల రీడిజైనింగ్‌ కోసం కృషి చేస్తున్నామన్నారు. తుమ్మిడి హెట్టి బ్యారేజీ ప్రథాన కాలువకు రెండు లిఫ్టులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆకుపచ్చ తెలంగాణా కోసం ప్రాజెక్టులను నిర్మిస్తున్నామన్నారు.ఇందులో భాగంగానే రీడిజైనింగ్‌ చేస్తున్నామన్నారు. గతంలో ప్రాణహిత-చేవేల్ల ప్రాజెక్టు పేరుతో జేబులు నింపుకున్న వారే నేడు మహా ఒప్పందాన్ని విమర్శిస్తున్నారన్నారు. తుమ్మిడి హెట్టి వద్ద బ్యారేజి నిర్మాణంతో మరో లక్షా 50వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *