మెదక్,డిసెంబర్23(జనంసాక్షి): ప్రజాసంక్షేమం లక్ష్యంగా సిఎం కెసిఆర్ చేపట్టిన అయుత చండీయాగం వేదోక్తంగా ప్రారంభమయ్యింది. వేదజ్ఞుల మంత్రోఛ్ఛరణల మధ్య విఘ్నేశ్వర పూజతో ప్రారంభమయ్యింది. మెదక్ జిల్లా ఎర్రవల్లిలోని వ్యవసాయక్షేత్రంలో అయుత మహా చండీయాగం బుధవారం ఉదయం ప్రారంభమైంది. గురు ప్రార్థనతో చండీమాత విగ్రహం ముందు మొదటిరోజు కార్యక్రమం ప్రారంభమైంది. నిర్ణయించిన ముహుర్తమైన 8.30నిమిషాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు యాగశాల ప్రవేశం చేశారు. రుత్వికులు, బ్రాహ్మణులు, నిర్వాహకులు సీఎంకు ఘనస్వాగతం పలికారు. యాగశాలకు వచ్చిన ఆయనకు వేద మంత్రోచ్ఛరణ, మంగళవాయిద్యాలు, పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. రుత్వికులతో కలిసి ముఖ్యమంత్రి దంపతులు యాగశాల ప్రదక్షిణ చేశారు. యాగస్థలికి చేరుకున్న గవర్నర్ దంపతులకు సీఎం దంపతులు స్వాగతం పలికారు. గవర్నర్ దంపతులు, సీఎం దంపతులు పూజలో పాల్గొన్నారు. గణపతి మహాపూజ, మహాసంకల్పం నిర్వహించారు. మహిళలు సామూహిక కుంకుమార్చన చేశారు. నభూతో న భవిష్యత్ అన్న చందంగా ఏర్పాట్లు చేసి నిర్వహిస్తున్న అయుత చండీయాగానికి సకలం సిద్ధమైన తరుణంలో వేకువజామునే 1100 మంది రుత్వికులు ….ముక్తకంఠంతో చండీ సప్తశతిని పారాయణం చేయటానికి సిద్ధమయ్యారు. సోమవారమే గణపతి ¬మంతో లాంఛనంగా మొదలైన యజ్ఞవాటికలో బుధవారం ఉదయం అత్యంత శక్తిమంతంగా భావించే అయుత మహా చండీయాగం ఆరంభం అయ్యింది. మంగళవారం ఉదయం నుంచి మూడుగంటల పాటు కేసీఆర్ దంపతులు కూర్చొని స్థలశుద్ధికోసం ఉదకశాంతి, మాతంగి అనుష్ఠానం పూర్తి చేశారు. అనంతరం, మధ్యాహ్నం కేసీఆర్ ఏర్పాట్లన్నింటినీ మరోమారు పర్యవేక్షించి పలు సూచనలు చేశారు. శృంగేరీ పీఠాధిపతి ప్రత్యేక ప్రతినిధులుగా శృంగేరీ పరిపాలనాధికారి గౌరీశంకర్, ప్రధానాచార్యులు నరహరి సుబ్రహ్మణ్యభట్టు, వాచకులు తంగిరాల శివకుమార శర్మలు చేరుకున్నారు. గోపూజ, గణపతి పూజతో కార్యక్రమం మొదలవుతుంది. శరీరశుద్ధి కోసం పంచగవ్యమేళన సేవనం. కలశస్థాపన చేసి అనుష్ఠానం ఆరంభించి 12 గంటల దాకా కొనసాగించారు. వేలాదిగా మహిళలు తరలివచ్చి తమకు నిర్దేశించిన స్థానాల్లో కూర్చుని కుంకుమార్చనలు చేశారు. తొలిరోజే మహామహులు రావడంతో ఆధ్యాత్మిక శోభకు మరింత శోభ కలిగింది. దీంతో అయుత మహాచండీయాగం నేపథ్యంలో ఎర్రవల్లిలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. యాగాన్ని తిలకించేందుకు విచ్చేస్తున్న ప్రముఖులు, ఆధ్యాత్మిక వేత్తల రాకతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. యాగశాల వద్ద 4వేల మంది తిలకించే విధంగా ఏర్పాట్లు చేశారు. రోజూ 50వేల మందికి అన్నదానం చేసే విధంగా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. దాదాపు 3,300 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. యాగశాల చుట్టూ 5కిలోవిూటర్ల వరకు సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్వహిస్తున్న అయుత చండీయాగానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, సీఎస్ రాజీవ్‌శర్మ, డీజీపీ అనురాగ్‌శర్మ, ఎంపీలు కవిత, కేశవరావు, ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు, ఆర్ట్‌ఆఫ్ లివింగ్ పండిట్ రవిశంకర్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ రామోజీరావు, పండిట్ రవిశంకర్‌కు సాదర స్వాగతం పలికారు. వీరిని యాగశాలకు తీసుకెళ్లారు సీఎం. ఇక యాగ శాలలో చండీ మహాయాగం కొనసాగుతుంది. యాగాన్ని వీక్షించేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతోన్న ఎర్రవల్లి
గడిచిన 200 ఏళ్ల చరిత్రలో ఎవరూ అయుత చండీయాగం నిర్వహించిన దాఖలాలు లేవని శృంగేరి పీఠం ముఖ్య కార్యనిర్వహణ అధికారి గౌరీ శంకర్ తెలిపారు. అయుత చండీయాగం నిర్వహిస్తున్న సీఎం కేసీఆర్‌కు శృంగేరీ పీఠాధిపతి భారతీతీర్థ స్వామి ఆశీస్సులు అందజేసిన సందేశాన్ని యాగస్థలిలో గౌరీ శంకర్ వినిపించారు. ప్రజల సంక్షేమం కోసం చేస్తున్న యాగం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ధర్మరాజు రాజసూయ యాగం చేసిన తరహాలో ఈ యాగానికి ఏర్పాట్లు చేశారని గౌరీశంకర్ అన్నారు. రుత్విజులతో యాగశాల మినీ ఇండియాను తలపిస్తోందన్నారు. శృంగేరి పీఠం ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా ఉన్న గౌరీశంకర్ ఎర్రవెల్లిలో జరుగుతున్న అయుత చండీయాగం కోసం ప్రత్యేక దూతగా వచ్చారు. పాలకులు ఈ యాగం నిర్వహించడం ఇద మొదటి సారని అన్నారు. దీంతో ప్రజలకు మేలు కలుగుతుందన్నారు. యాగం కోసం తెప్పించిన పూజాద్రవ్యాల పరిమళాలు,¬మ ద్రవ్యాలతో మంచి సువాసనలు అందుకోవడంతో ఇక్కడికి వచ్చిన వారు ఆధ్యాత్మికానాందనానికి లోనయ్యారు. సామూహిక వేదపఠనం వారిని అనిర్వచనీయమైన ఆనందానికి లోను చేసింది. మహిళలు భక్తిశ్రద్దలతో తమ స్థానాల్లో కూర్చి కుంకుమార్చనలతో అమ్మవారిని సేవించారు. అయుత చండీయాగం పూర్తిగా శృంగేరీ పీఠసంప్రదాయాలమేరకు ఏకోత్తరవృద్ధి విధానంలో సాగుతోంది. అక్కడి పండితుల ఆధ్వర్యంలోనే దీనిని చేపట్టారు. వారే దీనికి మార్దదర్శకులు. అయుత చండీయాగంతోపాటు మహారుద్రయాగం, కుమారస్వామి, గణపతి, రుద్ర¬మాలు, చతుర్వేద హవనం, పారాయణాలు, జపాలు జరుగుతాయి. 106 ¬మగుండాలతో 1500 మంది రుత్విక్కులు, 5 రోజులపాటు 10 వేల సప్తశతి పారాయణలను, చండీ నవాక్షరి జపాలను చేస్తారు. ఒక్కో రుత్విక్కుడు తొలిరోజు ఒక సప్తశతి పారాయణం, నాలుగు వేల చండీ నవాక్షరీ జపం చేస్తారు. రెండోరోజు రెండు వేల పారాయణాలు, మూడువేల జపాలు. మూడోరోజు మూడు వేల పారాయణాలు, రెండు వేల జపాలు. నాలుగోరోజు నాలుగు సప్తశతి పారాయణాలు, వేయి చండీ నవాక్షరీ జపం. చివరిరోజున ఒక్కో ¬మగుండం వద్ద 11 మంది రుత్విక్కులు పాయసంతో ¬మం చేస్తారు. 100 మంది పాలతో 10 వేల పారాయణాలకు దశాంశం వేయిసార్లు తర్పణలిస్తారు. అనంతరం మహాపూర్ణాహుతి అయుత చండీయాగం సంపూర్ణమవుతుంది. వీటితోపాటు రోజూ నవదుర్గలకు నవావరణ పూజ, బలిప్రదానం, సువాసినీపూజలు, కన్యకాపూజలు, మహిళలతో కుంకుమార్చనలు, సాయంకాలం ప్రదోషకాలంలో అవధారయలు, రాజోపచారాలు, శాస్త్రాలు, ప్రవచనాలు, మంగళ నీరాజన మంత్రపుష్పాలు ఉంటాయి. అయుతం అంటే పదివేలు. పదివేల సంఖ్యను పూరిస్తూ చండీ (దుర్గ) సప్తశతీ పారాయణాలను పూర్తి చేసి, ఆ సంఖ్యలోని దశాంశంతో అంటే వేయిసార్లు నామాలతో ¬మం చేసి, పూర్ణాహుతులను సమర్పించడమే అయుత చండీయాగం. ఆధ్యాత్మిక సంపన్నుల భాష్యమేమిటంటే.. కలియుగంలో నామజపానికీ, యాగానికీ ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. అంతేగాక కలౌచండీ వినాయకౌ అన్న సూక్తి మేరకు చండీ ఉపాసనకూ అమిత ప్రాధాన్యం ఉంటుంది. నిజానికి శక్తిరూపిణి అయిన చండిక ఉగ్రరూపిణి. ఆ ఉగ్రత్వం ఎందుకనేదీ ప్రస్తావనాంశమే. చండికలోని ఉగ్రత్వం శత్రుసంహారకం, దుష్టసంహారకం. అంటే ధర్మవర్తనులను పీడించే అన్ని రుగ్మతలపైనే ఆ ఉగ్రత్వం! వెరసి సమాజ కళ్యాణానికి ఆ ఉగ్రత్వం ఉపయోగకరం. ఆమెను ప్రసన్నం చేసుకునే సర్వోత్కృష్ణ ప్రయత్నమే అయుత చండీయాగం! ఈ యాగం ఎర్రవల్లిలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహిస్తున్న ఆయుత చండీయాగాన్ని తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్ సర్వీసులు ఏర్పాటు శారు. ప్రముఖులు, ఆధ్యాత్మిక వేత్తలు, సందర్శకుల రాకతో ఎర్రవల్లి చేరుకునే దారులన్నీ కిటకిటలాడాయి. ప్రతి రోజూ 50వేల మంది సందర్శకులకు భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. ఒకేసారి దాదాపు 5వేల మంది భోజనం చేసేందుకు వీలుగా భోజన శాలలు ఏర్పాటు చేశారు.





