Tuesday, 3 November 2026

మహిళను హత్య చేసి…దొంగతనం

fpq81uobచిత్తూరు, ఆగస్టు 29 : జిల్లాలోని కుప్పంలో దారుణం జరిగింది. అర్బన్ కాలనీలోని ఓ ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు అడ్డువచ్చిన మహిళ కంట్లో కారం చల్లి అతి కిరాతకంగా హత్య చేశారు. ఆపై ఆరు తులాల బంగారం, రూ.2 లక్షల నగదు తీసుకుని పరారయ్యారు. శరణ్య అనే మహిళ తన కుమారుడు, సోదరుడితో కలిసి అర్బన్ కాలనీలో నివాసముంటోంది. నిన్న వరలక్ష్మీ వ్రతం కావడంతో నగలు, నగదుతో అమ్మవారిని అలంకరించింది. అర్థరాత్రి సమయంలో ఇంట్లోకి చొరబడిన దొంగలు అడ్డువచ్చిన శరణ్య కళ్లలో కారం చల్లి అతి దారుణంగా చంపేసి బంగారంతో ఉడాయించారు. మృతురాలి భర్త బెంగళూరులో ఉంటున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *