Tuesday, 3 November 2026

మహిళపై ఆటో డ్రైవర్ అత్యాచారయత్నం…

uwr2p7zzనల్గొండ : ఏకంగా తన ఆటోలో ప్రయాణిస్తున్న మహిళపై అత్యాచారానికి ప్రయత్నించాడో మృగాడు. నల్లగొండ జిల్లా సూర్యాపేటలో చదువుతున్న విద్యార్థి కాలేజీకి వెళ్లడానికి ఆటో ఎక్కింది. కొంత దూరం ప్రయాణించాక ఆటో డ్రైవర్ తన అసలు రూపం చూపడం మొదలుపెట్టాడు. అసభ్యంగా మాట్లాడుతూ లైంగికంగా వేధించాడు. తనకు సహకరించాలని… లేకపోతే ఊరుకోనని హెచ్చరించాడు. డ్రైవర్ బెదిరింపులతో ఏం చేయాలో అర్థంకాని ఆ అమాయకురాలు ఆటోనుంచి బయటకు దూకేసింది. ఈ విషయం గమనించిన స్థానికులు ఆటోను వెంబడించి ఆ దుర్మార్గున్ని చితకబాదారు. పోలీసులకు అప్పగించారు. అటు గాయపడ్డ బాధితురాలిని మహిళపై అత్యాచారానికి ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న కాలేజీ నిర్వాహకులు ఆ విద్యార్థినికి ధైర్యం చెప్పారు. ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్న ఆటోలపై నిఘా పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *