Tuesday, 3 November 2026

మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ

తిరుపతి,జూలై28(జ‌నం సాక్షి): పద్మావతి మహిళా విశ్వ విద్యాలయంలో శనివారం ఎపి పరిశ్రమల శాఖామంత్రి అమరనాథరెడ్డి చేతుల విూదుగా మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ నిర్వహించారు. కుట్టు మిషన్లను పంపిణీ చేసిన అనంతరం మంత్రి మాట్లాడుతూ.. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ప్రభుత్వ పథకాలు సహకరిస్తున్నాయన్నారు. ప్రభుత్వ పథకాలతో ఎంతోమంది నిరుపేదల జీవితాల్లో వెలుగులు నిండాయని పేర్కొన్నారు.

—————