అనిగండ్ల పాడు; మహిళలపై జరుగుతన్న దాడులను వైఎస్‌ఆర్ కాంగ్రేస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ తీవ్రం గా ఖండిచారు. ఢిల్లీలో అయిదేళ్ల చిన్నారిపై అత్యాచార ఘటనపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ ప్రభుత్వాలు కఠిన చర్యలు తీపుకుంటే ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయన్నారు. మగవాళ్ల ఆలోచనల్లోనూ మార్పు రావాలని , అందరిలోనూ తల్లి, చెల్లి, బిడ్డను చూసే విధంగా ఆలోచనాదృష్టి రావాలని ఆమె అన్నారు. అత్యాచార ఘటనను నిరసిస్తూ నోటికి నల్ల రిబ్బన్ కట్టుకుని నిరసన తెలిపారు




