Wednesday, 4 November 2026

మహిళాభ్యుదయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

కాకినాడ,మార్చి3(జ‌నంసాక్షి): యానాం దేశంలో లింగ నిర్దారణ పరీక్షల్ని అరికట్టి మహిళాభ్యుదయానికి కృషి చేయాలని యానాం ఎఎస్పీ డీ వంశీధరరెడ్డి పిలుపునిచ్చారు. ‘బేటీ బచావో- బేటీ పడావో’ అంశంపై మత్స్యకార గ్రామం ఇరియాంపేట ప్రాథమికోన్నత పాఠశాలలో జరిగిన ప్రత్యేక సదస్సులో ఆయన మాట్లాడారు. బాల్య వివాహాలు, భ్రూణ హత్యల్ని అరికట్టాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇంఛార్జి పరిపాలనాధికారి సిలాంబరసన్‌, సమాచార శాఖ ప్రచారాధికారి శ్రీనివాస మహేశ్‌, విద్యాశాఖాధికారి సాయినాథ్‌ తదితరలు మహిళాభ్యుదయంపై ప్రసంగించారు. సామాజిక వేత్త వేణుగోపాల్‌, పీ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. ఇక స్వైన్‌ఫ్లొ రాకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని పి.గన్నవం ప్రభుత్వ ¬మియో వైద్యుడు ఎం. శ్రీనివాస్‌ సూచించారు. గణెళిశుల వెంకటసుబ్బారాయుడు జ్ఞాపకార్థం ఆయన కుమారులు చిన్నకొండల్రావు, సూరిబాబు స్వైన్‌ఫ్లొ నివారణకు మందులు కొనేందుకుఈ ఆసుపత్రికి ఆర్థికసాయం అందించారు. మందులను కొనుగోలు చేసి ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు డా. శ్రీనివాస్‌ తెలిపారు. ఈ మాత్రలను క్రమం తప్పకుండా 3రోజుల పాటు వేసుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *