Thursday, 5 November 2026

మహోన్నత వ్యక్తి జ్యోతిరావు పూలే

exgvigh7బడుగు బలహీనవర్గాల అభివృద్ధికి పాటుపడ్డ మహోన్నత వ్యక్తి జ్యోతిరావు పూలే అని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ కొనియాడారు. స్త్రీలను విద్యావంతులను చేసేందుకు దేశంలోనే మొదటిసారిగా మహిళా పాఠశాలను ప్రారంభించారని ఆయన గుర్తుచేశారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన జ్యోతిరావు పూలే జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ కూడా అన్ని వర్గాల అభివృద్ధికి పాటుపడుతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ చెప్పారు. తెలంగాణ రాష్ర్టంలో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు టిఆర్ఎస్ ఎంపి బూర నర్సయ్య గౌడ్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *