Tuesday, 3 November 2026

మావోయిస్టులకు ఆయుధాలిస్తున్న స్మగ్లర్ల అరెస్ట్‌

ముంగేర్‌: విధ్వంసకాండను సృష్టించేందుకు గాను మావోయిస్ట్‌లకు ఆయుధాలు, పేలుడు పదార్ధాలను సమాకూర్చుతున్న ఇద్దరు ఆయుధ స్మగ్లర్లు అరెస్ట్‌ అయ్యారు. బీహార్‌ రాష్ట్రంలోని ముంగేర్‌ జిల్లాలో పోలీసులు శనివారం వీరిని అదుపులోకి  తీసుకున్నారు.

ఈ ఆయుధ స్మగ్లర్ల అక్రమాలపై విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందగానే ఎస్టీఎఫ్‌ దళాల సాయంతో పోలీసులు రంగంలోకి దిగారు. కాషిం బజార్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మక్షాష్‌ మొహల్లా వద్ద గల ఇంటిపై ఈ దళాలు దాడి చేసి స్మగ్లర్లను పట్టుకున్నట్లు ఎస్సీ రాజీవ్‌ మిశ్రా తెలియజేశారు.

స్మగ్లర్లను రవి శర్మ, క్రాంతి శర్మలుగా గుర్తించగా. దాడి చేసిన ఇంటి నుంచి 70 డిటోనేటర్లు, ఒక రివాల్వర్‌, ఎకె -47లో ఉపయోగించే కొన్ని లైవ్‌ క్యాటరిడ్జ్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *