Thursday, 5 November 2026

‘మావోయిస్టులను కోర్టులో హాజరుపరచాలి’

భద్రాచలం, జనంసాక్షి: నిన్న పోలీస్‌ దాడులలో అదుపులోకి తీసుకున్న మావోయిస్టులను కోర్టులో హాజరుపరచాలని వారి బంధువులు డిమాండ్‌ చేస్తున్నారు. వారిని పోలీసులు ఏదైన చేస్తారేమోనని వారు భయపడుతున్నారు. మృత దేహాలను తమకు చూపించడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రి బయట కొందరు బోరున విలపిస్తున్నారు. భద్రాచలంలోనే పోస్ట్‌మార్టం చేసి మృతదేహాలను తమకు అప్పగించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *